అమెరికా అందులోనూ అగ్ర రాజ్యం...ప్రపంచ దేశాలని శాసించేంతటి కెపాసిటీ..పెద్దన్నగా ఓ హోదా...మరి అలాంటి దేశానికి అధ్యక్షుడు అంటే ఏ రేంజ్ లో ఉండాలో, ఎంత హుందాగా, భాద్యతగా ఉండాలో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. కానీ ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వలన, అమెరికా సిల్లీ కంట్రీ అయ్యిపోయింది. హుందా తనాన్ని పోగొట్టుకుంది, ప్రత్యేకించి నీతులు చెప్పాల్సిన పరిస్థతి నుంచీ నీతులు చెప్పించుకునే పరిస్థితికి దిగజారి పోయింది. వెరసి

IHG

అమెరికానా అంటూ నోళ్ళు వెళ్ళబెట్టే పరిస్థితి నుంచీ అమెరికానా అంటూ కరివేపాకులా తీసిపడేసే పరిస్థితికి దిగజారిపోయింది. దీనంతటికి కారణం ట్రంప్ వెకిలి చేష్టలు, తిక్క నిర్ణయాలు, తప్పుడు వ్యాఖ్యలు,అధ్యక్షుడనే పొగరు..ఫలితంగా అమెరికా అధ్యక్ష పదవికి తనంతట తానే  ఎసరు పెట్టుకున్నట్టుగా అయ్యింది. కరోనా చైనా లో కలకలం సృష్టిస్తున్న సమయంలో ట్రంప్ మాట్లాడుతూ కరోనా కాదు కదా దాని అమ్మమ్మకి  కూడా అమెరికాలోకి ఎంట్రీ లేదు అంటూ తెగ బీరాలు పలికాడు..కానీ

IHG'totally under control' - POLITICO

ఊహించని విధంగా కరోనా అమెరికాలో ఇప్పుడు వేల మంది ప్రాణాలని బలి తీసుకుంది. గత నెలలోనే కరోనా ఎఫెక్ట్ ని ఊహించి ముందు జాగ్రత్త చర్యలని తీసుకోవాలని ప్రజలని హెచ్చరించి ఉండుంటే ఇప్పుడు ఉన్న పరిస్థితి ఉండేది కాదు, కానీ ప్రజలని తప్పుదోవ పట్టించేలా ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ఇంతటి వినాశనానికి దారితీశాయి. అంతేకాదు..కరోనా జీరో స్థాయికి చేరుకుంటుంది అయితే ఎవరూ షేక్ హ్యాండ్ ఇచ్చుకోవద్దు అంటూ ప్రజలని ఉద్దేశించి చెప్పిన ట్రంప్ ఓ వేదికపై బాధ్యతా రాహిత్యంగా పలువురికి కరచాలనం ఇచ్చారు.

IHG's <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=WAR' target='_blank' title='war-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>war</a> on <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=CORONAVIRUS' target='_blank' title='coronavirus-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>coronavirus</a> is just his latest <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=WAR' target='_blank' title='war-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>war</a> on truth ...

ఇదిలాఉంటే కరోనా వెళ్ళిపోతుంది అదే పెద్ద రిస్క్ కాదని చెప్పిన ట్రంప్ మాటలని ఉద్దేశిస్తూ అదే వేదికపై వైద్య నిపుణులు కరోన ఏంతో డేంజర్ అమెరికాపై దాడి చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ప్రకటించారు. కానీ ఆ మాటలని లైట్ తీస్కున్న ట్రంప్ అమెరికా ప్రజల భవిష్యత్తుని గాలిలో పెట్టారు. గతంలో జరిగిన ఈ పరిణామాలు అన్నిటినీ వీడియోల రూపంలో అతికించి ట్రంప్ కరోనా విషయంలో చేసిన బాధ్యతారాహిత్య పనులని ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తూ ఇలాంటి అధ్యక్షుడా మనకి కావాల్సింది అంటూ ఫైర్ అవుతున్నారు అమెరికన్స్, బాధ్యత కలిగిన వ్యక్తి అధ్యక్షుడిగా ఉండాలి అలాంటి వాళ్ళు అమెరికా అధ్యక్షుడిగా ఉండాలంటూ కామెంట్స్ చేస్తున్నారు. దాంతో కరోనా సర్దుమణిగాక జరగబోయే అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ ని అమెరికా ప్రజలు ఇంటికి సాగనంపనున్నారని స్పష్టంగా అర్ధమవుతోందని అంటున్నారు అమెరికా రాజకీయ విశ్లేషకులు..

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

Apple : https://tinyurl.com/NIHWNapple

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: