క‌రోనా వైర‌స్ లేదా కోవిడ్‌-19.. ప్ర‌స్తుతం ప్ర‌పంచ‌దేశాల‌ను క‌మ్మేసింది. ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ బారిన పడి మరణిస్తోన్న వారి సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. ముఖ్యంగా  చైనా, ఇటలీ, స్పెయిన్, ఫ్రాన్స్, అమెరికా, ఇరాన్ వంటి దేశాల్లో మరణాల సంఖ్య భయాందోళనలను కలిగిస్తోంది. భారత్ కూడా దీనికి మినహాయింపేమీ కాదు. మనదేశంలో కరోనా వైరస్ బారిన పడి మరణించిన వారి సంఖ్య గురువారం నాటికి 13కు చేరుకుంది. అలాగే ఇప్ప‌టి వ‌ర‌కు ప్ర‌పంచ దేశాల్లో మొత్తం 21,116 క‌రోనా మ‌ర‌ణాలు సంభ‌వించాయి. మ‌రియు 4,65,274 మందికి క‌రోనా వైర‌స్ పాజిటివ్ గా తేలింద‌ని తెలుస్తోంది.

 

ఇక ఈ క‌రోనా వైర‌స్‌ను నివారించ‌డానికి ప్రపంచవ్యాప్తంగా దేశాలు లాక్‌డౌన్ విధిస్తున్నాయి. లేదంటే తీవ్ర ఆంక్షలు అమలు చేస్తున్నాయి. మ‌రోవైపు కరోనా సోకితే ప్రాణాలకు హాని కలుగుతుందన్న భయంతో చాలామంది స్వస్థలాలకు వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఓ మహారాష్ట్ర కూలీ కూడా కరోనా నేపథ్యంలో సొంత ఊరికి వెళ్లేందుకు ఎద‌రూ చేయ‌ని స‌హ‌స‌మే చేశారు. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. ఆ కూలీ పేరు నరేంద్ర షెల్కే. పూణేలో దినసరి కూలీగా పనిచేస్తున్న నరేంద్ర కరోనా భయాలతో సొంత ఊరు అయిన చంద్రాపూర్ జిల్లాలోని జాంబ్‌కి వెళ్లాలని డిసైడ్ అయ్యాడు.

 

అనుకున్న‌ట్టుగా మొదట పూణే నుంచి నాగ్ పూర్ వరకు రైల్లో సాఫీగానే వెళ్లాడు. కానీ, మహారాష్ట్ర ప్రభుత్వం లాక్ డౌన్ విధించడంతో చేసేది లేక కాలినడకన బయల్దేరాడు. దారి మధ్యలో తిందామన్నా ఏమీ దొరకని దయనీయ పరిస్థితుల్లో కేవ‌లం నీళ్లు తాగి కడుపు నింపుకున్నాడు. అయినా వెనుక‌డుగు వేయ‌కుండా వంద కిలోమీట‌ర్లు ముందుకు నడిపించాడు. అయితే 100 కిలోమీటర్లకు పైగా పయనం సాగించిన తర్వాత పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్ర‌మంలోనే కర్ఫ్యూ అమల్లో ఉంటే ఎందుకు బయటికి వచ్చావని పోలీసులు న‌రేంద్ర‌ను అడ‌గ‌గా.. అస‌లు విష‌యం వివ‌రించారు.

 

అత‌డి స‌హ‌సానికి ఆశ్చ‌ర్య‌పోయిన సబ్ ఇన్ స్పెక్టర్ తన ఇంటి నుంచి భోజనం తెప్పించాడు. వైద్యులను పిలిపించి నరేంద్ర ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్న అనంతరం ఓ వాహనం సమకూర్చి సొంత ఊరికి వెళ్లే ఏర్పాటు చేశారు. ప్ర‌స్తుతం న‌రేంద్రకు రెండు వారాల హోమ్ క్వారంటైన్ విధించారు.

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: