ప్రపంచం ప్రమాదంలోకి వెళ్లిపోతుంది.. దీనికంతటికి కారణం కరోనా.. ఈ వైరస్ వచ్చి ఇన్ని రోజులవుతున్న దీనికి ఇంకా విరుగుడు మాత్రం కనిపెట్టలేదు.. కనీసం ఈ వైరస్ వ్యాపించకుండా అయినా అడ్డుకట్ట వేయలేక పోతున్నారు.. ముఖ్యంగా ఉన్నత చదువులు చదువుకున్న వారు.. విదేశాల్లో పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తున్న వారు భారతదేశంలో ఈ వైరస్ వ్యాపించడానికి కారణం అవుతున్నారు.. కొంచెం కూడా బాధ్యతగా ప్రవర్తించని ఇలాంటి వారు మన ఇండియన్స్ అని చెప్పడానికే ఇప్పుడు సిగ్గుపడేలా చేసారు..

 

 

ఇకపోతే కరోనా వైరస్ సోకిన వ్యక్తిని గుర్తించాలంటే వారం రోజులకు పైన పడుతుంది.. ఈ లోపుగా అతని ద్వారా మరికొంత మందికి సోకుతుంది.. దీనివల్ల ఈ వ్యాధి వేగంగా వ్యాపిస్తుంది.. అయితే కేవ‌లం నిమిషాల వ్యవధిలోనే కరోనా వైరస్ ను గుర్తించే స్మార్ట్ ఫోన్ ఆధారిత పోర్టబుల్ కిట్ ను యూనివర్సిటీ ఆఫ్ ఈస్ట్ ఆంగ్లియా రూపొందించింది. ఈ కిట్ ద్వారా 50 నిమిషాల్లోనే కరోనాను నిర్ధారించవచ్చని పరిశోధకులు చెబుతున్నారు. కాగా ఈ కిట్ ద్వారా ఒకేసారి 16 నమూనాలను పరీక్షించే వీలుందని పరిశోధకులు తెలిపారు.

 

 

తమకు వైరస్ సోకిందో - లేదో తెలుసుకోవడంతో పాటు తమ ద్వారా కరోనా వ్యాప్తి చెందకుండా చేయడానికి ఈ కిట్ ఉపయోగపడుతుందని వివరించారు. అదెలా అంటే గొంతు నుంచి సేకరించిన నమూనా నుంచి 3 నిమిషాల్లోనే ఆర్ ఎన్ ఏను వెలికితీసి కరోనా నిర్థారిత పరీక్షలు చేయ‌వ‌చ్చు. ప్రస్తుతం ల్యాబ్ పరీక్షల ద్వారా కోవిడ్ నిర్ధారణకు 24 నుంచి 48 గంటల సమయం పడుతున్న తరుణంలో తక్కువ నైపుణ్యం కలిగిన వైద్య సిబ్బంది కూడా ఈ కిట్ ను ఉపయోగించేలా రూపొందించిన‌ట్లు పరిశోధక బృందానికి నేతృత్వం వహించిన జస్టిన్ ఓ గ్రాడీ తెలిపారు. ఇకపోతే ఈ కిట్ ను నేషనల్ హెల్త్ సర్వీస్ రెండు వారాల పాటు పరీక్ష చేయనుంది.  

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

Apple : https://tinyurl.com/NIHWNapple

మరింత సమాచారం తెలుసుకోండి: