కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో దేశంలో ప్రస్తుతం లాక్ డౌన్ కొనసాగుతోంది. ఈ లాక్ డౌన్ సమయంలో అత్యవసర సేవలనందించే ఉద్యోగులను తప్ప సామాన్య ప్రజల్ని ఎవరిని బయటకి రానివ్వడం లేదు పోలీసులు. కొన్ని ప్రాంతాలలో కొంతమంది పోలీసులు ఇల్లు లేని అనాధలకు ఆహారం అందిస్తూ అందరి మన్నలను పొందుతున్నారు. కానీ మరి కొన్ని ప్రాంతాలలో ఇల్లు లేక రోడ్ల మీద బతికే వారిని అతి కిరాతకంగా కొడుతున్నారు పోలీసులు. నిత్యావసర సరుకుల కోసం బయటికి వచ్చిన వారికి కొంత మంది పోలీసులు దణ్ణం పెడుతూ బయటికి రావద్దని ప్రాధేయపడుతుండగా... మరికొంత మంది పోలీసులు మాత్రం వారిని నిర్ధాక్షణ్యంగా చచ్చేటట్టు కొడుతున్నారు. దీన్ని బట్టి చూస్తే పోలీసు వ్యవస్థలో కొంతమంది మంచి వాళ్ళు ఉన్నా మిగతావాళ్లంతా ఓవర్ యాక్షన్ చేస్తూ... ఏ తప్పు చేయని అమాయకపు సామాన్య ప్రజలను లిమిట్స్ దాటి మరీ లాఠీ ఛార్జ్ చేస్తున్నారని తెలుస్తోంది. వీరి రాక్షసత్వానికి నిదర్శనంగా తాజాగా పశ్చిమగోదావరి జిల్లాలో జరిగిన ఒక సంఘటన నిలుస్తుంది.




సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్న ఓ వీడియో గురించి చెప్పుకుంటే... పశ్చిమ గోదావరి జిల్లా, పెరవలి మండలం, ఖండవల్లి గ్రామంలోని ఒక యువకుడు దుబాయ్ నుండి స్వదేశానికి తిరిగి వచ్చాడు. అయితే ఈ సమాచారం తెలుసుకున్న పెరవలి మండల ఎస్సై సదరు యువకుడు ఇంటికి చేరుకున్నాడు. ఆ తర్వాత అతడిని ఓ కర్రతో తీవ్రంగా కొట్టడం ప్రారంభించాడు. అలాగే యువకుడి తండ్రిని కూడా పచ్చి బూతులు తిడుతూ కర్రతో కొట్టాడు. తన కొడుకు ఇంట్లో నుండి బయటకి వెళ్లట్లేదని యువకుడి తల్లి చెప్పగా... సదరు ఎస్సై ఆమెపై విరుచుకుపడుతూ 'తాట తీస్తా' అంటూ మహిళ అని కూడా చూడకుండా కర్రతో కొట్టాడు. దాంతో ఆ యువకుడు కోపంతో ఊగిపోతూ ఆ ఎస్ఐ పై ఎదురు తిరిగినట్లు వీడియో చివర్లో కనిపిస్తుంది.




తల్లిదండ్రులని నీచంగా దూషిస్తూ వారిని కర్రతో కొట్టడం ఏ మాత్రం సరికాదని సదరు ఎస్సై పై చర్యలు తీసుకోవాలని నెటిజన్లు ఏపీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయగా... తక్షణమే స్పందించిన ఆంధ్రప్రదేశ్ హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత సదరు ఎస్సైని సస్పెండ్ చేయడం జరిగిందని సోషల్ మీడియా వేదికగా తెలిపారు. ఏది ఏమైనా ప్రస్తుతం ఈ ఎస్ఐ ని విపరీతంగా తిడుతున్నారు నెటిజనులు.




క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :



NIHWN వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 


Google: https://tinyurl.com/NIHWNgoogle



Apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: