ఆపత్సమయంలో కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై బురద చల్లటమే టార్గెట్ గా పచ్చమీడియా పనిచేస్తోంది. ప్రపంచం మొత్తాన్ని వణికించేస్తున్న కొరోనా వైరస్ దెబ్బకు దేశాలకు దేశాలే లాక్ డౌన్ అయిపోతున్నాయి. ఇందులో భాగంగా యావత్ దేశం కూడా షట్ డౌన్ అయిపోయింది. ఒక్కసారిగా దేశం మొత్తాన్ని  లాక్ డౌన్ చేయటంలో ఉద్దేశ్యం కొరోనా వైరస్ వ్యాప్తిని నియంత్రించటమే. ఇటువంటి సమయంలో వివిధ రాష్ట్రాల మధ్య సమస్యలు సహజం.

 

అదే పద్దతిలో ఏపితో కూడా పొరుగు రాష్ట్రాలకు సరిహద్దులను  మూసేశారు. ఈ నేపధ్యంలో  అక్కడక్కడ గొడవలు జరుగుతున్నాయి. అయితే దీన్నే అవకాశంగా తీసుకుని పచ్చమీడియా జగన్ ప్రభుత్వంపై బురద చల్లేస్తోంది. సరిహద్దుల్లో జరుగుతున్న గొడవలనే హైలైట్ చేస్తోంది. ఎక్కడ ఉన్న వాళ్ళని అక్కడే ఉండమని ప్రధానమంత్రితో పాటు ముఖ్యమంత్రులు కూడా ఒకవైపు జనాలకు అప్పీల్ చేస్తున్నారు. అదే సమయంలో కొందరు జనాలు అప్పీలును లెక్క చేయకుండా ఉన్న ప్రాంతాల నుండి సొంతూళ్ళకు బయలుదేరారు.

 

ఇక్కడే జనాలతో సమస్యలు మొదలయ్యాయి. అంటే తప్పంతా జనాలదే అయితే పచ్చమీడియా మాత్రం జగన్ ప్రభుత్వాన్నే ముద్దాయిగా చూపిస్తోంది. ప్రభుత్వంపై జనాలను రెచ్చగొట్టేట్లుగా కథనాలు అచ్చేస్తోంది. మళ్ళీ ఇదే సమస్య తెలంగాణా సహరిద్దుల్లో కూడా  ఉన్నా కేసియార్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాత్రం రాయటం లేదు. తన ప్రభుత్వానికి వ్యతిరేకంగా కథనాలు వస్తే కేసియార్ బొందపెడతాడనే భయం వల్లే తెలంగాణా సమస్యలను హైలైట్ చేయటం లేదు.

 

అసలు సమస్యకు మూల కారణమే తెలంగాణా నుండి వచ్చిన జనాలు. పైగా చాలామంది స్క్రీనింగ్ టెస్టులకు అంగీకరించటం లేదు. జనాలను తప్పు పట్టాల్సిన పచ్చమీడియా ఎదురు జగన్ ప్రభుత్వంపైనే విరుచుకుపడుతోంది. అలాగే పోలీసులతో వివిధ డిపార్టుమెంట్లతో సమన్వయ లోపం ఉన్న మాట వాస్తవమే. దీంతో అక్కడక్కడ గొడవలు అవుతున్నాయి. ఇదే అదునుగా చిన్న గొడవలను బూతద్దంలో పెద్దగా చూపిస్తోంది. విపత్తు సమయంలో మద్దతుగా నిలబడి ప్రభుత్వం తరపున జనాలకు అప్పీల్  చేయాల్సిన పచ్చమీడియా కేవలం సమస్యలను మాత్రమే హైలైట్ చేయటంలో అజెండా అర్ధమైపోతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: