అసలే కొరోనా వైరస్ తో ప్రపంచ దేశాలు వణికిపోతున్నాయి. మొత్తం మీద వరస్ట్ ఎఫెక్టెడ్ దేశాలుగా ఇప్పటి వరకూ ఇటలీ, స్పెయిన్, చైనా, ఇరాన్ నిలిచాయి. సరే వీటి తర్వాత మరికొన్ని దేశాలున్నా అగ్రరాజ్యమైన అమెరికా కూడా అన్నీ విధాలుగా పోటి పడుతోంది. అమెరికాలో ఇటు వేల కేసులూ నమోదవుతున్నాయి. అటు మృతుల సంఖ్యా రోజు రోజుకు పెరిగిపోతోంది.  రెండు వైపులా జరుగుతున్న నష్టాలతో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో పాటు ఆ దేశ జనాలంతా అల్లాడిపోతున్నారు.

 

అసలే సమస్యల్లో కూరుకుపోతున్న అమెరికాకు మరో ప్రమాదం పొంచి ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అదేమిటంటే నిరోద్యమట. అవును కొరోనా వైరస్ దెబ్బకు తొందరలోనే సుమారు 1.5 కోట్లమంది ఉద్యోగాలు కోల్పోనున్నట్లు తెలుస్తోంది. కొరోనా మహమ్మారిని ఎదుర్కోవటానికి ట్రంప్ తాజాగా 150 లక్షల కోట్లతో అతిభారీ ప్యాకేజీని ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే.

 

అయితే తొందరలో జరగబోయే నష్టాన్ని  ట్రంప్ ప్రకటించిన ప్యాకేజి ఏమాత్రం ఆదుకునే అవకాశం లేదట. ఎందుకంటే అమెరికాలోని 50 రాష్ట్రాల్లో ఇప్పటివరకూ అందిన సమాచారం ప్రకారం కాలిఫోర్నియా, న్యూజెర్సీ, న్యూయార్క్, వాషింగ్టన్, కనెక్టికట్, హవాయి, మోంటానా, నెవాడా రాష్ట్రాలు దారుణంగా దెబ్బతిన్నట్లు అంచనా వేస్తున్నారు. వీటిల్లో కూడా న్యూయార్క్, కాలిఫోర్నియా, న్యూజెర్సీ రాష్ట్రాల్లో పరిస్ధితి అయితే మరీ ఘోరమట.

 

అమెరికా మొత్తం మీద ఐటి కంపెనీలు ఎక్కువగా న్యూయార్క్, వాషింగ్టన్, న్యూజెర్సీ, కాలిఫోర్నియా రాష్ట్రాల్లోనే  ఎక్కువగా ఉన్నాయట. హవాయి, మోంటానా, నెవాడా రాష్ట్రాలు టూరిజం, సేవారంగాల్లో  బాగా ముందున్నాయట. అంటే కొరోనా వైరస్ కారణంగా పై రాష్ట్రాల్లోనే భారీ  నష్టాలు జరిగే అవకాశాలున్నాయని అంచనా వేస్తున్నారు. ఐటి కంపెనీలు మూతపడిపోయి, టూరిజం, సేవారంగాలు కుప్పకూలిపోతే ఈ రంగాల్లోని  1.5 కోట్ల మందికి ఉద్యోగాలు, ఉపాధి పోవటం ఖాయమని అంచనా. ఇదే నిజమైతే అమెరికాలో ఉద్యోగాలు చేస్తున్న విదేశీయుల మీద ప్రధానంగా భారతీయుల మీదే ప్రభావం పడుతుందనటంలో సందేహం లేదు. మరి చూడాలి ఏం జరుగుతుందో.

మరింత సమాచారం తెలుసుకోండి: