రోజురోజుకూ విస్తృతంగా వ్యాపిస్తున్న కరోనాన కట్టడి చేయాలి. రోజురోజుకూ పెరుగుతున్న కరోనా రోగులకు వైద్యం చేయాలి.. కరోనా వచ్చిన వారిని క్వారంటైన్ చేయాలి. అనుమానితులను కూడా క్వారంటైన్ చేయాలి. ఇలా క్వారంటైన్ చేయాల్సిన వారి సంఖ్య క్రమంగా వేలల్లోనుంచి లక్షలకు చేరుతుంది. మరి అన్ని లక్షల బెడ్లు మన ఇండియాలో సిద్ధంగా ఉన్నాయా..?

 

 

ఎన్ని ఆసుపత్రులు ఉంటే మాత్రం ఏం సరిపోతాయి. ఇలాంటి సమయంలో యుద్ధప్రాతిపదికన బెడ్లు సిద్ధం చేయాలి. స్కూళ్లు, కాలేజీలు, మైదానాలు ఇలా అవకాశం ఉన్న అన్నింటినీ క్వారంటైన్ కేంద్రాలుగా మార్చాలి అప్పుడే కరోనాను కట్టడి చేయగలం. సరిగ్గా ఈ దిశలోనే ఆలోచిస్తున్న కేంద్రానికి ఓ అద్భుతమైన ఐడియా వచ్చింది. ఎలాగూ దేశమంతటా లాక్ డౌన్ ఉంది. దేశంలో వేల రైళ్లు ఎక్కడి రైళ్లు అక్కడే నిలిచిపోయాయి.

 

 

ఇలాంటి సమయంలో రైలు బోగీలనే క్వారంటైన్ కేంద్రాలుగా చేయొచ్చు కదా. ఐడియా ఇప్పుడు చాలా అవసరంగా కనిపిస్తోంది. దేశవ్యాప్తంగా వేల కొద్దీ రైళ్లున్నాయి. వాటిలో ఒక్కో బోగీని ఒక్కో వార్డుగా మార్చేయొచ్చు. అత్యవసర సేవలు అందించొచ్చు. కాకపోతే.. కాస్త ఆసుపత్రి ఫార్మాట్ కు అనుకూలంగా కాస్త మార్పులు చేస్తే సరిపోతుంది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఈ దిశగా ఆలోచిస్తోంది.

 

 

రైళ్లను క్వారంటైన్ కేంద్రాలుగా మార్చేందుకు చేయాల్సిన స్వల్ప మార్పులపై రైల్వే శాఖ కసరత్తు చేస్తోంది. ఈ విషయంలో కేంద్రంలోని రైల్వేశాఖ, వైద్య ఆరోగ్య శాఖలు సమన్వయం చేసుకుని రైళ్లను క్వారంటైన్ కేంద్రాలుగా మార్చే దిశగా చర్చలు సాగుతున్నాయి. ఏదేమైనా ఐడియా అదిరిపోయింది కదా.

 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN
వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

Apple : https://tinyurl.com/NIHWNapple

మరింత సమాచారం తెలుసుకోండి: