చైనాలోని వుహాన్ న‌గ‌రం కేంద్రంగా పుట్టిన క‌రోనా వైర‌స్ చూస్తూ ఉండ‌గానే ప్ర‌పంచాన్ని చుట్టేసింది. కానీ.. ఇక్క‌డ ఒక ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఏమిటంటే.. చైనాకు మిత్ర‌దేశాలైన ర‌ష్యా, ఉత్త‌ర‌కొరియాలో మాత్రం క‌రోనా ప్ర‌భావం లేదు. ఈ రెండు దేశాల‌కు వైర‌స్ వ్యాప్తి చెంద‌లేదు. అంతేగాకుండా.. చైనాలోని వుహాన్ న‌గ‌రానికి మాత్ర‌మే ఈ వైర‌స్ ప‌రిమిత‌మై ఉంది.. మిగ‌తా న‌గ‌రాల‌కు మాత్రం వ్యాపించ‌లేదు. ఈ నేప‌థ్యంలో డ్రాగ‌న్ దేశంపై అంత‌ర్జాతీయంగా అనేక అనుమానాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. వైర‌స్ సృష్టి చైనా ప‌నేన‌నే  అనుమానాలు రోజురోజుకూ బ‌ల‌ప‌డుతున్నాయి. ఆ దేశ శ‌త్రువైన అమెరికా ఆర్థిక వ్య‌వ‌స్థ‌ను దెబ్బ‌తీసేందుకే చైనా ఈ క‌రోనా ప్లాన్ వేసింద‌ని ప‌లువురు విశ్లేష‌కులు అంచ‌నా వేస్తున్నారు. 

 

అంతేగాకుండా.. క‌రోనా వైర‌స్‌కు విరుగుడును కూడా చైనా ముందే క‌నిపెట్టింద‌ని, అందుకే వుహాన్‌న‌గ‌రంలో అంత తొంద‌ర‌గా రిక‌వ‌రీ సాధ్య‌మైంద‌ని ప‌లువురు అంటున్నారు. వైర‌స్ విరుగును మిత్ర‌దేశాలైన ర‌ష్యా, ఉత్త‌ర కొరియాకు అంద‌జేసింద‌ని, అందుకే ఆ రెండు దేశాల్లో ఒక్క పాజిటివ్ కేసు కూడా న‌మోదు కాలేద‌ని చెబుతున్నారు. అమెరికాను ప్ర‌త్య‌క్షంగా ఎదుర్కోలేకే చైనా క‌రోనా కుట్ర‌కు తెర‌లేపి, అగ్రరాజ్యం ఆర్థిక వ్య‌వ‌స్థ‌ను అత‌లాకుత‌లం చేస్తోంద‌నే వాద‌న రోజురోజుకూ బ‌లంగా వినిపిస్తోంది. వైర‌స్‌కు యాంటీ డోస్ ఉన్నందునే వుహాన్ న‌గ‌రంలో చైనా అధ్య‌క్షుడు జిన్‌పింగ్ ప‌ర్య‌టించిన‌ప్పుడు ఒక్క మాస్క్ మాత్ర‌మే ధ‌రించార‌ని, ప్రొటెక్టివ్ గౌన్లు, గ్లౌస్‌లు ధ‌రించ‌లేద‌ని అనుమానం వ్య‌క్తం చేస్తున్నారు.

 

ఇక్క‌డ మ‌రొక ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఏమిటంటే.. అంత‌ర్జాతీయంగా స్టాక్ మార్కెట్లు అత‌లాకుత‌లం అవుతున్న వేళ‌.. చైనా స్టాక్ మార్కెట్లు మాత్ర క‌ళ‌క‌ళ‌లాడుతున్నాయి. ఇది కూడా చైనా వ్యూహంలో భాగ‌మేన‌ని విశ్లేష‌కులు అంటున్నారు. ఏం జ‌రుగుతుందో.. ప్ర‌పంచ వ్యాప్తంగా ఏం జ‌రుగుబోతుందో.. ముందే చైనాకు తెలుసున‌ని, ఈ ప‌రిణామం అంతా కూడా డ్రాగ‌న్ క‌నుస‌న్న‌ల్లోనే నడుస్తోంద‌ని అనుమానం వ్య‌క్తం చేస్తున్నారు. ఇదిలా ఉండ‌గా.. చైనాపై అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ ప‌లుమార్లు ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన విష‌యం తెలిసిందే. ఇది చైనా వైర‌స్ అని, చైనా వ‌ల్లే ఈరోజు ప్ర‌పంచం అతలాకుత‌లం అవుతోంద‌ని మండిప‌డ్డారు. కాగా, వైర‌స్‌ల‌కు మ‌తాలు, స‌రిహ‌ద్దులు ఉండ‌వ‌ని, క‌రోనా వైర‌స్‌ను ప్రకృతే సృష్టించిద‌ని ఇప్ప‌టికే ప్రపంచ ఆరోగ్యం సంస్థ పేర్కొనడం గ‌మ‌నార్హం. 

మరింత సమాచారం తెలుసుకోండి: