ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ అత్యంత వేగంగా విస్తరిస్తుంది. అన్ని దేశాలకు కరోనా వైరస్ ఇప్పుడు విస్తరించడంతో ఎం చెయ్యాలి అనేది ఎవరికి అర్ధం కాని పరిస్థితి. కరోనా వైరస్ ఇప్పుడు అత్యంత వేగంగా సునామీ మాదిరిగా విస్తరిస్తుంది. మన దేశం సహా ప్రపంచ దేశాలు అన్నీ కూడా కరోనా వైరస్ దెబ్బకు ప్రాణ భయంతో భయపడే పరిస్థితి ఏర్పడింది ఇప్పుడు. 200 దేశాలకు కరోనా వైరస్ విస్తరించింది. అమెరికాలో స్వైరవిహారం చేస్తోంది. కరోనా కేసుల్లో ఇప్పుడు ఆ దేశం మొదటి స్థానంలో ఉంది. కరోనా తీవ్రతకు అమెరికాలో 266 మంది కరోనాతో మృతి చెందారు గురువారం. 

 

ఇటలీలో 80, 589.. స్పెయిన్‌లో 57, 786.. జర్మనీలో 43, 938 కేసులు నమోదయ్యాయి. భారత్‌లో 722 కేసులు నమోదు కాగా.. నిన్న ఒక్క రోజే 88 కేసులు పాజిటివ్ గా నమోదు అయ్యాయి. అమెరికాలోని న్యూయార్క్, వాషింగ్టన్, లూసియానా, న్యూజెర్సీ , కాలిఫోర్నియా, టెక్సాస్, ఉత్తర కరోలినా, ఫ్లోరిడా, మిచిగాన్, లోవా రాష్ట్రాల్లో కరోనా ప్రభావం తీవ్రంగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా నమోదైన కేసులు 5, 31, 630 కాగా  మరణాలు  సంఖ్య 24, 065 గా ఉంది. వీరిలో కోలుకున్న వారు 1, 23, 391 గా ఉన్నారు. ఇంకా కరోనా తో బాధపడుతున్న వారి సంఖ్య 3, 84, 174 గా ఉంది. 

 

ఇటలీ లో క్రమంగా మరణాల సంఖ్య అనేది భారీగా పెరుగుతుంది. ఊహించని విధంగా కరోనా మరణాలు నమోదు కావడంతో ఇటలీ ఇప్పుడు ఎం చెయ్యాలో అర్ధం కాని స్థితిలో ఉంది. మన దేశంలో కూడా కరోనా వేగంగా విస్తరిస్తుంది. దాదాపు అన్ని రాష్ట్రాల్లో కరోనా కేసులు నమోదు అయ్యాయి. ఊహించని విధంగా కరోనా చాప కింద నీరు మాదిరి విస్తరిస్తుంది మన దేశంలో.

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: