కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం ఈ నెలాఖరు వరకూ లాక్ డౌన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ లాక్‌ డౌన్‌ ఎత్తి వేత కు సమయం దగ్గర పడుతోంది. ఇంకో నాలుగైదు రోజులైతే లాక్ డౌన్ ఎత్తేయాల్సి ఉంటుంది. కానీ అటు కేంద్రం మాత్రం 21 రోజుల లాక్ డౌన్ ప్రకటించింది. మరి కేసీఆర్ తెలంగాణలో లాక్ డౌన్ ఎత్తేసినా.. కేంద్రం అమలు చేస్తున్న లాక్ డౌన్ మాత్రం అమలులోనే ఉంటుంది. అంతే కాకుండా ఇప్పుడిప్పుడే తెలంగాణలో కరోనా కాస్త అదుపులోకి వస్తోంది.

 

 

ఈ సమయంలో లాక్ డౌన్‌ ఎత్తేస్తే మళ్లీ పరిస్థితి మొదటికి వచ్చే ప్రమాదం ఉంది. మొదట్లో లాక్ డౌన్‌కు జనం కాస్త సహకరించకపోయినా ఇప్పుడు కాస్త అలవాటు పడ్డారు. పోలీసుల దెబ్బలతో జనం అవసరం ఉంటే తప్ప బయటకు రావడం లేదు. అందుకే కరోనా ను సమర్థవంతంగా అడ్డుకోవాలంటే.. ప్రస్తుతం రాష్ట్రంలో అమలులో ఉన్న రాత్రి పూట కర్ఫ్యూను ఈనెల 31 తర్వాత కూడా కొనసాగించాలని కేసీఆర్ ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది.

 

 

ప్రధాని నరేంద్ర మోడీ ఏప్రిల్‌ 14 వరకు లాక్‌డౌన్‌ ప్రకటించారు కాబట్టి.. కేసీఆర్ కూడా రాత్రి కర్ఫ్యూను కూడా ఏప్రిల్ 14 వరకూ పొడిగించాలని ఆలోచిస్తున్నారట. కరోనా పై ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తున్న కేసీఆర్.. ఈ అంశంపై అధికారులతో చర్చించారట. రాత్రి పూట కర్ఫ్యూ పొడగింపు నిర్ణయాన్ని ఒకటి, రెండు రోజుల్లో ప్రకటించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

 

 

కరోనా వ్యాప్తిని అడ్డుకోవాలంటే జనం బయట తిరగడాన్ని కట్టడి చేయాల్సిందేనని.. జనం బయట తిరుగుతుంటే కరోనా కట్టడి ఆశించిన స్థాయిలో సాధ్యం కాదని కేసీఆర్ అభిప్రాయపడుతున్నారు. లాక్‌డౌన్‌, కర్ఫ్యూలను మరింత పకడ్బందీగా అమలు చేస్తే తప్ప కరోనా మహమ్మారి నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోలేమని ఆయన భావిస్తున్నారు. త్వరలోనే ఆయనే స్వయంగా ఈ నిర్ణయాన్ని వెల్లడించే అవకాశం ఉంది.

 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN
వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

Apple : https://tinyurl.com/NIHWNapple

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: