తెలుగుదేశంపార్టీలో విచిత్రమైన పరిస్దితులు కనబడుతున్నాయి. మొన్నటి ఎన్నికల్లో ఎదురైన ఘోరమైన ఓటమి తర్వాత చంద్రబాబునాయుడు లాగే చాలామంది సీనియర్లలో స్తబ్దత నెలకొంది. కాకపోతే ఓటమిని భరించలేక, జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా అంగీకరించలేక చంద్రబాబు చాలా ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు. ప్రతిరోజు ఏదో ఓ కారణంతో జగన్ పై ఆరోపణలు గుప్పించటం, విమర్శలు చేయటంతో తన కసిని తీర్చుకుంటున్నారు.

 

ఇక్కడే చంద్రబాబుకు కొందరు  సీనియర్లకు  తేడా కనబడుతోంది. జగన్ పై ఆరోపణలు చేసి ఉపయోగం లేదన్న ఉద్దేశ్యంతో కొందరు సీనియర్లు దాదాపు సైలెంట్ అయిపోయారు. పార్టీ కార్యక్రమాలకు కొందరు దాదాపు దూరంగానే ఉంటున్నారు. ఏలూరు మాజీ ఎంపి మాగంటి బాబు, విజయనగరంలో మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు, మాజీ ఎంపి మురళీమోహన్, మాజీ మంత్రి కళా వెంకటరావు, గంటా శ్రీనివాసరావు, నారాయణ, పత్తిపాటి పుల్లారావు, జీవీ ఆంజనేయులు లాంటి వాళ్ళు కామ్ అయిపోయారు.

 

టిడిపి అధికారంలో ఉన్నంత కాలం పై నేతలు యమా యాక్టివ్ గా ఉన్న విషయం అందరికీ తెలిసిందే. అప్పట్లో జగన్ పై ప్రతిరోజు విరుచుకుపడేవారే. అదే నేతలు ఇపుడు చంద్రబాబు పిలుపిస్తున్నా పట్టించుకోవటం లేదు. అనంతపురంలో జేసి సోదరులు కూడా యాక్టివ్ రాజకీయాలకు దూరంగా ఉంటున్నా తమ వారసులను రంగంలోకి దింపిన కారణంగా వాళ్ళు బాగానే తిరుగుతున్నారు.  అలాగే మాజీ మంత్రి పరిటాల సునీత కామ్ గా ఉంటున్నా వారసుడు పరిటాల శ్రీరామ్ పార్టీ కార్యక్రమాల్లో తిరుగుతునే ఉన్నాడు.

 

నిజానికి పార్టీ మొత్తం మీద ఎంతమంది నేతలు యాక్టివ్ గా ఉన్నారో చెప్పమంటే చెప్పటం కష్టమే. చంద్రబాబు కాకుండా మాజీ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, ఎంఎల్ఏలు రామానాయుడు, బుచ్చయ్య చౌదరి లాంటి కొందరు మాత్రమే యాక్టివ్ గా ఉంటున్నారు. మొత్తం మీద సైలెంట్ అయిపోయిన సీనియర్ల వైఖరే మిగిలిన వాళ్ళకు అర్ధం కావటం లేదు. తాను స్వయంగా మాట్లాడుతున్నా కొందరు సీనియర్లు ఎందుకు దూరంగా ఉంటున్నారో అర్ధంకాక చంద్రబాబులో టెన్షన్ పెరిగిపోతోంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: