తెలంగాణాలో కరోనా వైరస్ కేసులు నమోదు అవుతున్న నేపధ్యంలో తెలంగాణా ప్రభుత్వం మరిన్ని సంచలన నిర్ణయాలు తీసుకునే విధంగా అడుగులు వేస్తుంది. కరోనా వైరస్ ని కట్టడి చేయడానికి గాను ఇప్పటికే కెసిఆర్ సర్కార్ అన్ని విధాలుగా చర్యలు తీసుకుంది. తెలంగాణాలో కరోనా వైరస్ కేసులు అనేవి ఇప్పుడు దాదాపు 50 కి దగ్గరలో ఉన్నాయి. ఈ కేసులు అన్నీ కూడా దాదాపు విదేశాల నుంచి వచ్చినవే కావడం గమనార్హం. అయితే పది కేసులు మాత్రం లోకల్ వాళ్లకు వచ్చినట్టు ప్రభుత్వం చెప్తుంది. 

 

కరోనా వైరస్ ని కట్టడి చేయడానికి గానూ గాంధీ ఆస్పత్రిని పూర్తి స్థాయిలో కరోనా ఆస్పత్రిగా మార్చారు. త్వరలోనే మరిన్ని ఆస్పత్రులను పూర్తి స్థాయిలో కరోనా ఆస్పత్రులుగా మార్చనున్నారు.  ప్రస్తుతం తెలంగాణాలో కరోనా వైరస్ రెండో దశలో ఉంది. ఇది పక్కన పెడితే తెలంగాణా ప్రభుత్వం మరిన్ని కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశాలు కనపడుతున్నాయి. కరోనా కట్టడికి ప్రభుత్వం పటిష్ఠమైన చర్యలు తీసుకుంటున్నా ప్రజలు పట్టించుకోకపోవడం, లాక్‌డౌన్ విధించినా ప్రజలు రోడ్ల మీదకు రావడంతో కెసిఆర్ ఆగ్రహంగా ఉన్నారు. 

 

ప్రస్తుత పరిస్థితుల్లో సాయంత్రం 7 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్నారు. దీనిని మార్చ్ 31 వరకు మాత్రమే అమలు చేస్తామని చెప్పారు. ఇప్పుడు దాన్ని మరింత కాలం పొడిగించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఇప్పుడు కరోనా కేసులు మరిన్ని పెరుగుతున్నందున రాత్రి పూట కర్ఫ్యూను ఏప్రిల్ 14 వరకు కొనసాగించాలని సీఎం కెసిఆర్ భావిస్తున్నారు. లాక్ డౌన్, కర్ఫ్యూ అమలు విషయాలపై ఆరోగ్య మంత్రి ఈటల రాజేందర్, సీఎస్ సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి తదితరులతో భేటి అయిన కెసిఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారని దీనిపై త్వరలోనే కెసిఆర్ అధికారిక ప్రకటన చేసే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: