ధూమపానం వల్ల కలిగే అనర్ధాల గురించి అనేక కథనాలు ప్రచురితమవుతూన్నా.. అవేమి ప‌ట్ట‌న‌ట్టు వ్య‌వ‌హ‌రిస్తారు కొంద‌రు. సినిమాల్లో, టీవీల్లో, యాడ్స్‌లో, చివ‌ర‌కు తాగే సిగ‌రెట్ పెట్టిపై సైతం సిగ‌రెట్ తాగ‌కండీ పోతారు..! అని చెబుతున్నా.. వినే ప‌రిస్థితి లేదు. అయితే ఇప్పుడు ఆ అల‌వాటే మీ ప్రాణాల మీద‌కు తెస్తుంది. సిగరెట్ల వల్ల గుండెజబ్బులు, హార్ట్ ఎటాక్, గుండె నాళాలకు సంబంధించిన రోగాలు వస్తాయ‌ని అంద‌రికీ తెలుసు. మ‌రియు ధూమపానం చేసే వారి కంటే చేయని వారి ఊపిరితిత్తులకు ఇన్‌ఫెక్ఫన్‌ రావడానికి తక్కువ అవకాశం ఉంటుంది. 

 

అంతేకాదు, సిగ‌రెట్ తాగ‌డం వ‌ల్ల క‌రోనా వైర‌స్ వ‌చ్చే అవ‌కాశాలు కూడా ఎక్కువే ఉన్న‌ట్టు ప‌రిశోధ‌న‌లో తేలింది. ప్ర‌స్తుతం ప్ర‌పంచ‌దేశాల‌ను క‌రోనా వైర‌స్ క‌మ్మేసింది. ఇప్ప‌టికే క‌రోనా వైర‌స్ మ‌ర‌ణాలు 21,116కు చేరుకోగా.. 4,65,274 పాసిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి. దీని బ‌ట్టీ చూస్తుంటే క‌రోనా వైర‌స్ ఎంత వేగంగా విస్త‌రిస్తుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ఇక తాజాగా చైనా శాస్త్రవేత్తలు జరిపిన పరిశోధనలో కొత్త విష‌యం బ‌య‌ట ప‌డింది. ప్రస్తుతం ప్రపంచాన్ని అల్లాడిస్తున్న కరోనా వైరస్.. పొగతాగేవారిపై మరింత పగబడుతుందని తెలుస్తోంది. మిగతా వారితో పోలిస్తే సిగ‌రెట్ తాగేవారిలో వైరస్ సోకే అవకాశం 14 రెట్లు ఎక్కువని శాస్త్రవేత్తలు వెల్ల‌డించారు. 

 

దేశంలో కరోనా సోకిన వేలాదిమందిపై జరిపిన పరిశోధన అనంతరం వీరు ఈ విషయాన్ని తెలిపారు. పొగతాగే వారిలో వ్యాధినిరోధక శక్తి తగ్గడం వల్ల వారిలో వైరస్ వ్యాపించే అవకాశాలు మిగతావారితో పోలిస్తే చాలా ఎక్కువని అంటున్నారు. అదేవిధంగా, పొగతాగేవారిలో శుభ్రత కోసం ఊపిరితిత్తులు మ్యూకస్‌ పొరను ఉత్పత్తి చేస్తాయని, అయితే,  పొగతాగేవారిలో మ్యూకస్ మందంగా ఉండడంతో వ్యర్థాలను బయటికి పంపేందుకు ఊపిరితిత్తులు చాలా కష్టపడతాయని అంటున్నారు. దీని బ‌ట్టీ చూస్తుంటే క‌రోనా కార‌ణంగా సిగ‌రెట్ తాగేవారికి క‌రోనా ముప్పు ఎక్కువ‌గా ఉండే అవ‌కాశం ఉంది. సో.. బీకేర్‌ఫుల్‌..!!

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

మరింత సమాచారం తెలుసుకోండి: