వామ్మో కరోనాతో ప్రజలు ఇప్పటికే భయానికి గురి అవుతున్నారు. ప్రతీ ఒక్కరు లాక్ డౌన్ కి సై అంటూ ఇళ్లల్లోనే ఉంటున్నారు. ప్రధాని మోదీ ఇచ్చిన పిలుపుతో ప్రతీ పౌరుడు పాటించక తప్పదు. కానీ ఈ రూల్స్ని ఉల్లంఘిస్తున్నారు ఎందరో. అటువంటి వారికి శిక్ష పడుతూనే ఉంది . ఇష్టం వచ్చినట్టు పని లేకపోయినా జనం గుమికూడితే  వారికి లాఠీతో దెబ్బలే.

 

 

ఇంకేం ఉంది కుదురుగా చచ్చినట్టు కూర్చోవలసిందే. ఇల్లు దాటి వస్తే అంతే సంగతి .కానీ అందరూ ఇలా ఉంటే ఇక్కడ మాత్రం జాతర జరిపారట ప్రజలు. జాతరలో వందల మంది ప్రజలు పాల్గొన్నారట . ఈ ఘటన ఎక్కడో కాదు ఆంధ్ర ప్రదేశ్ లోని తూర్పు గోదావరి జిల్లా పోలవరం మండలం , మురమళ్ళ గ్రామంలోనే .ఇక్కడ జాతర జరిపి నిప్పుల మీద నడిచారు దీనితో అక్కడికి వందలాది మంది గుమికూడారు.

 

 

ఇలాంటివి లాక్ డౌన్ సమయాల్లో చెయ్యకూడదు అని అన్నారు . ఇలా చెయ్యడం ఎంతో ప్రమాదం అని జాగ్రత్తగా వ్యవహరించాలి అని చెప్పారు . ఇలాంటివి లాక్ డౌన్ సమయాల్లో చెయ్యకూడదు కానీ చాలా చోట్ల ప్రజలు అధికారుల ఆదేశాల్ని పాటించడంలేదు. దీని వాళ్ళ నష్టపోయేది మనమే అని ప్రతీ ఒక్కరు తెలుసుకోవాలి. నలుగురు కలిస్తేనే ప్రమాదం. అటువంటిది జాతర వంటివి చేస్తే అది నిజంగా అందరికి ఇబ్బందే కదా...

 

 
 
 
క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :
 
NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.
 
 

మరింత సమాచారం తెలుసుకోండి: