తెలంగాణ రాష్ట్రంలో రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతున్న విషయం తెలిసిందే. నిన్నటివరకు రాష్ట్రంలో 45 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీరు గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే గాంధీ ఆస్పత్రి సిబ్బంది కరోనా భయంతో స్వచ్ఛందంగా సెలవులపై వెళుతున్నారు. కరోనా వార్డుల్లో తాము పని చేయలేమంటూ నర్సులు, ఆయాలు, సెక్యూరిటీ గార్డులు చెబుతున్నారు. 
 
తాము 24 గంటల పాటు కరోనా బాధితులకు సేవలు అందిస్తున్నా... ఆస్పత్రి యాజమాన్యం తమ జాగ్రత్తలను పట్టించుకోవడం లేదని సిబ్బంది చెబుతున్నారు. నర్సులకు ఆస్పత్రిలో పూర్తి స్థాయి భద్రత కల్పించాలని... రోగులకు సేవ చేసి ఇంటికెళ్లి భర్త, పిల్లలను కలవాలంటే భయంగా ఉందని వాపోతున్నారు. ప్రభుత్వం తమకు భద్రత కల్పించాలని నర్సులు నిన్న సాయంత్రం ఆస్పత్రి సూపరిండెంట్ శ్రావణ్ కుమార్ కు లేఖను సమర్పించారు. 
 
ఆస్పత్రిలో విధుల నిర్వహణ పూర్తయిన తర్వాత తమ భర్తలు బైక్ లపై తీసుకెళుతున్నా పోలీసుల నుంచి ఇబ్బందులు ఎదురవుతున్నాయని లేఖలో పేర్కొన్నారు. ప్రభుత్వం తమ భర్తలకు కూడా రవాణా పాసులను ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం తమను గాంధీ ఆస్పత్రి సమీపంలో ఉన్న భవనంలో ఉండాలని కోరిందని... భవనానికి మరమ్మత్తులు చేయిస్తే తమకు ఉండటానికి ఎటువంటి అభ్యంతరం లేదని పేర్కొన్నారు. 
 
ప్రమాదకరమైన కరోనా వార్డుల్లో రోజూ తాము పని చేయలేకపోతున్నామని... నర్సుల డ్యూటీలను రెండు రోజులకు ఒకసారైనా మార్చాలని సిబ్బంది కోరారు. ఆస్పత్రిలో పని చేస్తున్న సీనియర్ నర్సులు తమకు సెలవులు ఇవ్వాలని కోరుతూ ఉండటం గమనార్హం. తాము కరోనా భారీన పడే అవకాశాలు ఉన్నాయని నర్సులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ లేఖపై ప్రభుత్వం స్పందించి తమకు మేలు జరిగే విధంగా నిర్ణయాలు తీసుకోవాలని కోరుతున్నామని సిబ్బంది లేఖలో పేర్కొన్నారు. 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: