కరోనా భయం మనుషుల్లో మానవత్వాన్ని కూడా చంపేస్తోంది. కరోనాపై అపోహలు మనుషులను కూడా రాక్షసులను చేస్తున్నాయి. విచక్షణ మరిచిపోయి దానవుల్లా తయారవుతన్నారు. ఎవరైనా రోడ్డుపై అచేతనంగా పడిపోతే ఏం చేస్తారు.. అయ్యో పాపం.. అని జాలి చూపిస్తారు. దగ్గర్లోని ఆసుపత్రికి తరలిస్తారు. మామూలు రోజుల్లో అయితే అక్కడ కూడా అలాగే చేసేవారేమో. కానీ ఇది కరోనా కాలం కదా.

 

 

అసలేం జరిగిందంటే.. కర్ణాటకకు చెందిన ఓ వ్యక్తి ఓ ప్యాసింజర్‌ వాహనం నడుపుతూ పటాన్‌చెరు నుంచి రామచంద్రాపురం వైపు వెళ్తున్నాడు. దారిలో తీవ్రంగా అస్వస్థతకు గురయ్యాడు. వాహనాన్ని పక్కకు నిలిపి దగ్గుతూ కిందకు దిగాడు. అలా దగ్గుతూనే ఓపిక లేక కూలబడిపోయాడు. ఇది గమనించిన కొందరు అతడికి కరోనా సోకిందేమో అని అనుమానించారు.

 

 

అంతే ఆ తర్వాత విచక్షణ మరిచి అతనిపై దాడి చేశారు. చేతికి అందిన రాళ్లతో కొట్టారు. అసలే ఓపిక లేకుండా పడిపోయిన రోగిపై విచక్షణ మరిచి దాడి చేశారు. జనమంతా గుమికూడటంతో విషయం పోలీసుల వరకూ వెళ్లింది. వారు ప్రజలను చెదరగొట్టి అతడిని ముందు పటాన్ చెరు ఆసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యుల సూచనల మేరకు ఆ రోగిని గాంధీ ఆసుపత్రికి పంపారు.

 

 

అసలు అతనికి ఏమైందో కూడా తెలుసుకోకుండా జనం రోగిపై రాళ్ల దాడి చేయడం ఎంత అమానుషం. నిజంగా అతనికి కరోనాయే అనుకుందాం. అయితే మాత్రం రాళ్లతో కొడితే ఏమొస్తుంది. చంపితే మాత్రం ఏమొస్తుంది.. కరోనా మరీ అంతగా మనుషుల్లోని మానవత్వాన్ని చంపేసింది. ఇప్పుడు ఆ రోగికి ఏమైనా అయితే ఆ పాపం.. కరోనాది మాత్రం కాదు. కరోనా భయంతో రాక్షసుల్లా మారిన మనుషులదే.

 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN
వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

Apple : https://tinyurl.com/NIHWNapple

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: