కరోనా వైరస్.. ఎంత ప్రమాదకరమైనదో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అత్యంత వేగంగా వ్యాపిస్తూ మనుషుల ప్రాణాలను తీస్తుంది ఈ కరోనా వైరస్. అలాంటి ఈ వైరస్ వ్యాప్తిని నియంత్రణ కోసం తెలంగాణ సర్కార్ కేసీఆర్ ఎన్నో కఠిన నిర్ణయాలు తీసుకున్నారు. అంతేకాదు కేంద్ర ప్రభుత్వం వచ్చే నెల 14వ తేదీ వరుకు ప్రతి ఒక్కరు ఇంట్లోనే ఉండాలి అని ఆయన చెప్పారు. 

 

దీంతో దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అయ్యింది. వచ్చేనెల 14 వరకు ఎవ్వరు బయటకు రాకూడదు అని ప్రజలందరినీ ఇంటికే పరిమితం చేశారు. ఇంకా తెలంగాణాలో అయితే లాక్ డౌన్ పాటించకుండా ఎవరైతే బయటకు వస్తున్నారో వారందరిని కూడా పోలీసులు కొడుతున్నారు. కారణాలు లేకుండా బయటకు రావడం ఎంత వరుకు న్యాయం అంటూ ప్రశ్నించారు. ఎందుకంటే తెలంగాణాలో కరోనా వైరస్ చాప కింద నీరులా అందరికి వ్యాపిస్తుంది. 

 

ఇంకా ఈ నేపథ్యంలోనే కరోనా వైరస్ కేసులు శృతి మించాయి. ఈరోజు ఉదయం 10 గంటలకు మరో కరోనా పాజిటివ్ కేసు నమోదు కాగా తెలంగాణాలో మొత్తం కరోనా కేసులు 45కు చేరాయి. దీంతో తెలంగాణాలో మరింత కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. రోజు రోజుకు పెరుగుతున్నాయి. ప్రజలందరినీ లాక్ డౌన్ చేసినప్పటికీ ఈ కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. దీంతో తెలంగాణాలో డాక్టర్లు మరింత అప్రమత్తంగా ఉన్నారు. అందుకే చెప్పేది.. అందరూ ఇళ్లలో ఉండండి అని.. అందుకే ఇంట్లో ఉండండి.. ఆరోగ్యంగా ఉండండి. 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: