మెగా ఫ్యామిలీ నుంచి వచ్చి అతి తక్కువ కాలంలో హిట్ అయిన హీరో రామ్ చరణ్. చిరంజీవి స్టార్ ఇమేజ్ ఉన్నా సరే అతను మాత్రం సొంతగా ఎదిగే ప్రయత్నం చేసాడు. తొలి సినిమాతో తనలో ఉన్న నటుడ్ని చూపించిన రామ్ చరణ్ రెండో సినిమాతో మాత్రం విశ్వరూపం చూపించాడు. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన మగధీర సినిమా అతని కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఈ సినిమా అతని కెరీర్ లో మైలురాయిగా నిలిచిపోయింది. సినిమాలో ప్రతీ సీన్ లో కూడా రామ్ చరణ్ ఎంతో పరిణితి చూపించాడు. సినిమా ఆద్యంతం కూడా రామ్ చరణ్ నటనే హైలెట్. 

 

రెండో సినిమా అయినా సరే ఏ మాత్రం కంగారు పడకుండా నటించిన రామ్ చరణ్సినిమా ద్వారా స్టార్ హీరో అయిపోయాడు. అక్కడి నుంచి అతను కెరీర్ లో వెనక్కు తిరిగి చూసుకునే అవసరం మాత్రం దాదాపుగా రాలేదు. ఆ తర్వాత ఎన్ని సినిమాలు చేసినా సరే మగధీర సినిమా మాత్రం అతని కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచి౦ది అనే చెప్పవచ్చు. ఆ తర్వాత వచ్చిన సినిమాలు ఫ్లాప్ అయినా సరే రామ్ చరణ్ కెరీర్ మాత్రం ఇబ్బంది పడలేదు అనే చెప్పాలి. టాలీవుడ్ లో రామ్ చరణ్ తో సినిమాలు చేయడానికి అగ్ర నిర్మాతలు కూడా అక్కడి నుంచి పోటీ పడ్డారు. 

 

యుద్ద సన్నివేశాల్లో కూడా అతని నటన ఎంతగానో ఆకట్టుకుంది. హావభావాలు సహా కొన్ని యాక్షన్ సీన్స్ లో అతను చూపించిన పరిణితి అన్నీ కూడా ఆకట్టుకున్నాయి. ఆ సినిమాలో రామ్ చరణ్ నటనకు అభిమానులు ఫిదా అయిపోయారు. అక్కడి నుంచి అతనికి అమ్మాయిల్లో కూడా ఫాలోయింగ్ పెరిగి చిరూ వారసుడు అనిపించుకున్నాడు అంటూ సిని పండితులు కూడా ఎన్నో సందర్భాల్లో వ్యాఖ్యానించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: