ప్రపంచం అంతా ఓ వైపు కరోనా భయంతో వణికిపోతుంటే కామాంధులు మాత్రం తమ జల్సాలు ఏమాత్రం తగ్గించుకోవడం లేదు. ఈ మద్య నిర్భయ నింధితులకు ఉరిశిక్ష విధించిన ఇలాంటి కామాంధులు ఏమాత్రం మార్పు రావడం లేదు.  దేశమంతా ఇప్పుడు కరోనా భయంతో లాక్ డౌన్ చేసిన విషయం తెలిసిందే.  ఈ నేపథ్యంలో తొమ్మింది మంది దుర్మార్గులు ఓ బాలికపై సామూహిక అత్యాచారం చేసిన ఘటన వెలుగు లోకి వచ్చింది.   జార్ఖండ్ లో మరో ఘోరం సంభవించింది. 16 ఏళ్ల బాలికపై తొమ్మిది మంది పాశవికంగా సామూహిక అత్యాచారం జరిపారు. దుంఖా జిల్లాలో ఈ ఘటన జరిగింది.

 

ఈ ఘటనపై జిల్లా ఎస్పీ వైయస్ రమేశ్ మాట్లాడుతూ, బాలికకు మాయమాటలు చెప్పిన దుండగులు ఆమెను పక్కన ఉన్న అడవిలోకి తీసుకెళ్లి, రేప్ చేశారని తెలిపారు. తనకు మాయ మాటలు చెప్పి మోసగించి తన పై రేప్ చేశారని.. రేప్ చేసిన వారిలో ఒకరు తన స్నేహితుడు అని... మిగిలిన వారు ఎవరో తనకు తెలియదని ఆవేదన వ్యక్తం చేసింది. దుంఖా టౌన్ నుంచి ఆమె గ్రామం సమీపం వరకు ఆమె స్నేహితులు ఇద్దరు బైక్ పై డ్రాప్ చేశారు. ఆ  తర్వాత గ్రామంలోకి తీసుకెళ్లమని మరో స్నేహితుడికి ఆమె ఫోన్ చేసింది. ఆ తర్వాత ఆమె స్నేహితుడు మరో వ్యక్తితో కలిసి బైక్ పై ఆమె వద్దకు వచ్చాడు.

 

అయితే అక్కడ పోలీస్ చెక్ చేస్తున్నారని.. మనం షార్ట్ కట్ లో వెళ్దాం అని చెప్పి నిర్మాణుష్య  ప్రాంతానికి తీసుకువచ్చారని చెప్పింది. అక్కడ అప్పటికే ఏడుగురు యువకులు ఉన్నారని.. వారంతా కలిసి తనపై సామూహిక అత్యాచారం చేశారని ఫిర్యాదులో పేర్కొంది. ఈ క్రమంలో ఆమె స్పృహ కోల్పోయింది. ఆ తర్వాత వారంతా అక్కడి నుంచి పరారయ్యారు. మరుసటి  రోజు ఉదయం ఆమె స్పృహలోకి వచ్చింది. ప్రస్తుతం యువతి ఆసుపత్రిలో చికిత్స పొందుతుందని.. ఆమె స్టేట్ మెంట్ తీసుకొని నిందితులను పట్టుకోవడానికి పోలీసులు గాలింపు చేపట్టారని చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి: