కరోనా మహమ్మారి ప్రపంచ వ్యాప్తంగా శరవేగంగా వ్యాపిస్తోంది. ఇప్పటికే వ్యాపించిన దేశాల్లో తన ప్రతాపం చూపుతోంది. దాదాపు ప్రపంచంలోని అన్ని దేశాలకూ ఈ కరోనా మహమ్మారి పాకింది. తాజా లెక్కల ప్రకారం చూస్తే.. కరోనా మహమ్మారి ఇప్పటికి 5 లక్షల 30 వేల మందికి పైగా సోకింది. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటి వరకూ 24 వేల మంది కరోనా కాటుకు బలయ్యారు.

 

 

ప్రపంచంలో అన్ని దేశాల కంటే కరోనా ప్రభావంతో ఎక్కువగా ఇటలీ ఇబ్బంది పడుతోంది. ఈ దేశంలో ఇప్పటి వరకూ కరోనా వల్ల 8 వేల మందికి పైగా మరణించారు. అంతే కాదు.. ఇంకా 80 వేల మంది కరోనాతో బాధపడుతున్నారు. కరోనా వ్యాప్తిని అరికట్టడలో ఇటలీది ఓ ఫెయిల్యూర్ స్టోరీగా మిగిలిపోతోంది. ఇక ప్రపంచం అగ్రరాజ్యంగా పేరొందిన అమెరికా కరోనా ధాటికి అల్లకల్లోలం అవుతోంది.

 

 

ఇప్పుడు ప్రపంచంలోనే అత్యధికంగా కరోనా కేసులు ఉన్న దేశంగా అమెరికా ఉండటం విశేషం. అక్కడ గత వారం రోజులుగా కరోనా వ్యాప్తి శరవేగంగా ఉంటోంది. అమెరికాలో మొత్తం 85 వేల మందికి పై గా కరోనా పాజిటివ్ వచ్చింది. అయినా ఆ దేశ అధ్యక్షుడు ట్రంప్ మాత్రం దేశాన్ని లాక్ డౌన్ చేసేందుకు సిద్ధంగా లేడు. అమెరికాలో ఇప్పటికే కరోనా కారణంగా 1300 మంది చనిపోయారు.

 

 

ఇక కరోనా మహమ్మారి విశ్వరూపం చూపుతున్న మరో దేశం స్పెయిన్.. ఈ దేశంలో ఇప్పటికే 4వేల 300 మందికి పైగా కరోనా కాటుకు బలయ్యారు. మరో 57 వేల మంది ఈ దేశంలో కరోనాకు చికిత్స పొందుతున్నారు. ఇక కరోనా మహమ్మారికి పుట్టినిల్లైన చైనా కోలుకుంటున్నా.. ఇంకా ఇక్కడ కూడా కరోనా కేసుల సంఖ్య తక్కువేమీ లేదు. ఇంకా 80 వేల మంది ఇక్కడ కరోనాకు చికిత్స తీసుకుుంటున్నారు. అయితే కొత్తగా ఎక్కువగా మరణాలు నమోదు కాకపోవడం చైనాకు ఊరటగా మారింది.

 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN
వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

Apple : https://tinyurl.com/NIHWNapple

 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: