కరోనా వైరస్ అత్యంత వేగంగా వ్యాపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ కరోనా వైరస్ కారణంగా ఎంతోమంది మరణిస్తున్నారు. ప్రపంచాన్ని గజ గజ వణికిస్తోంది ఈ కరోనా వైరస్. ఇంకా అలాంటి ఈ కరోనా వైరస్ భారత్ లోకి ప్రవేశించి అందరిని భయాందోళకు గురి చేసింది. ఈ కరోనా వైరస్ వ్యాప్తిని నియంత్రించాలని కేంద్ర ప్రభుత్వం ఎంతో కఠినమైన నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. 

 

ఏప్రిల్ 14 వ తేదీ వరుకు ఏ ఒక్కరు బయటకు రాకూడదు అని కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. అంతటి సంచలన నిర్ణయం తర్వాత ప్రజలు ఎవరు బయటకు రాకుండా ఇళ్లకే పరిమితం అయ్యారు. బయటకు వచ్చే వారిపై కేంద్ర ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకుంటుంది. ఎవరైనా బయటకు వస్తే పోలీసులు లాఠీలు విరిగిపోతున్నాయి. అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో దేశం ఉంది. 

 

ఇంకా కేంద్రం కఠిన నిర్ణయాల నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వాలు వాటిని తుచ తప్పకుండ పాటిస్తున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో పోలీసులు కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారు. అయినప్పటికీ కరోనా వైరస్ వ్యాప్తి తగ్గడం లేదు.. నేడు తాజాగా తెలంగాణాలో ఓ కరోనా వైరస్ పాజిటివ్ కేసు నమోదు అయ్యింది. దీంతో తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 45 కు చేరింది. ఇక ఆంధ్ర ప్రదేశ్ లో ఇప్పటి వరుకు 11 కేసులు కరోనా పాజిటివ్ నమోదు కాగా అందులో ఒకరు కరోనా బారి నుండి బయటపడ్డారు. ఈరోజుకు ఆంధ్ర తెలంగాణ కలిపి మొత్తం 56 కేసులు నమోదు అయ్యాయి. 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: