రాష్ట్రంలో ప్రస్తుతం కరోనా వైరస్ నేపథ్యంలో లాక్ డౌన్ చేసిన విషయం తెలిసిందే.  ఇప్పటికే భారత దేశంలో 500 పైగా కేసులు నమోదు అయ్యాయి.. 14 మంది మరణించారు.  దేశ వ్యాప్తంగా కరోనా ను అరికట్టేందుకు లాక్ డౌన్ చేసిన విషయం తెలిసిందే. తెలుగు రాష్ట్రాల్లో కరోనా మహమ్మారిని ప్రారదోలేందుకు సీరియస్ యాక్షన్ తీసుకుంటున్న విషయం తెలిసిందే.  ఈ నేపథ్యంలో గుంటూరు జిల్లాలోని తాడేపల్లిలో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ నేతృత్వంలో ఏపీ కేబినెట్‌ ప్రత్యేక సమావేశం ప్రారంభమైంది.  ఈ సమావేశంలో సీఎం జగన్ తో పాటు  రాష్ట్ర మంత్రులు, ఉన్నతాధికారులు సామాజిక దూరం పాటిస్తూ ఈ సమావేశంలో చర్చలు జరుపుతున్నారు. కాన్ఫరెన్స్‌ హాలులో ఈ సమావేశం ఏర్పాటు చేశారు.

 

కరోనా వైరస్‌ నియంత్రణకు తీసుకుంటున్న చర్యలపై చర్చించనుంది. లాక్‌డౌన్‌ కాలంలో పేదల కోసం ప్రకటించిన ఉచిత రేషన్‌, వెయ్యి రూపాయల పంపిణీ నిర్ణయాలకు ఆమోదం తెలపనుంది. మూడు నెలల బడ్జెట్‌కు కూడా ప్రభుత్వం ఆర్డినెన్స్‌ తీసుకురానుంది. జూన్‌ నెలాఖరు వరకు అవసరమై నిధుల కోసం తేనున్న ఈ ఆర్డినెన్స్‌ను మంత్రివర్గ ఆమోదం తర్వాత గవర్నర్‌కు పంపన్నారు.   కరోనా వైరస్‌ వ్యాప్తిని అరికట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలపై మంత్రులతో జగన్ చర్చిస్తున్నారు. ప్రజలు ఇబ్బందులు పడకుండా అందించాల్సిన సేవలపై చర్చిస్తారు.   

 

ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కరోనాను అరి కట్టేందుకు కేంద్రం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ చేశారు. ప్రజలు బయట తీరగ కుండా పకడ్భందీ చర్యలు తీసుకుంటున్నారు. ఒకవేళ లాక్ డౌన్ ని ఉల్లంఘిస్తే వారిపై కేసులు నమోదు చేసి జైల్లో పెడుతున్నారు.  ఈ నేపథ్యంలో దేశ వ్యాప్తంగా పలు చోట్ల కేసులు కూడా నమెదు అయినట్లు సమాచారం.  ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల వల్ల ఎలాంటి పరిణామాలైన ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉన్నట్లు ఏపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: