ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. తాజాగా విశాఖలో మరో కరోనా పాజిటివ్ కేసు నమోదైంది. వైద్య ఆరోగ్య శాఖ విశాఖకు చెందిన కరోనా పాజిటివ్ రోగి బంధువుకు కరోనా సోకినట్లు తెలిపింది. ఈరోజు కరోనా పాజిటివ్ కేసు నమోదు కావడంతో రాష్ట్రంలో కేసుల సంఖ్య 12కు చేరింది. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 384 మందికి కరోనా పరీక్షలు జరిగాయి. వీరిలో 317 మందికి నెగిటివ్ రాగా 55 మందికి సంబంధించిన రిపోర్టులు రావాల్సి ఉంది. 
 
మరోవైపు నిన్న హైదరాబాద్ లో ఇద్దరు డాక్టర్లకు కరోనా పాజిటివ్ అని తేలిన విషయం తెలిసిందే. ఇద్దరు డాక్టర్లు కొన్ని రోజుల క్రితం తిరుపతిలోని స్విమ్ ఆస్పత్రి వైద్యులను కలిశారు. స్విమ్స్ లో పని చేస్తున్న ఇద్దరు డాక్టర్ల బ్లడ్ శాంపిల్స్ ను సేకరించి పరీక్షల కోసం పంపారు. తెలంగాణ ప్రభుత్వం జరిపిన విచారణలో ఇద్దరు డాక్టర్లు స్విమ్స్ లోని తమ స్నేహితులైన ఇద్దరు వైద్యులను కలిశారని తేలింది. 
 
స్విమ్స్ లో పని చేస్తున్న వైద్యుల వివరాలను గోప్యంగా ఉంచారు. ఈరోజు సాయంత్రం 5 గంటలకు వైద్యుల నమూనాలకు సంబంధించిన రిపోర్టులు అందనున్నాయి. వారికి కరోనా కోకిందో లేదో ఈరోజు సాయంత్రం తెలియనుంది. స్విమ్స్ ఆస్పత్రి వైద్యులను ప్రస్తుతం క్వారంటైన్ లో ఉంచారని సమాచారం. ఈ విషయానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 
 
మరోవైపు ఈరోజు ఏపీ కేబినెట్ సమావేశం జరుగుతోంది. ప్రభుత్వం మూడు నెలల బడ్జెట్ కు సంబంధించిన ఆర్డినెన్స్ ను తీసుకురానుంది. ప్రభుత్వం జూన్ 30 వరకు అవసరమైన నిధులకు సంబంధించిన ఆర్డినెన్స్ ను ప్రవేశపెట్టనుంది. ప్రభుత్వం కేబినెట్ ఆమోదం అనంతరం ఆర్డినెన్స్ ను గవర్నర్ కు పంపనుంది. కేబినెట్ సమావేశానికి ఐదో బ్లాక్ కాన్ఫరెన్స్ హాల్ లో మంత్రులందరూ సామాజిక దూరం పాటించేలా ఏర్పాట్లు చేశారు. 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 


 
 
 
 

మరింత సమాచారం తెలుసుకోండి: