జగన్మోహన్ రెడ్డి ఓ సిఎంగా వ్యవహరించటం లేదు..

రాష్ట్రప్రభుత్వ తీరు సరిగా లేదు..

విదేశాల నుండి ఎంతమంది వచ్చారనే విషయంలో సరైన లెక్కలు లేదు..

కేంద్రం ప్రకటించిన ప్యాకేజికి అదనంగా రాష్ట్రం ఏమీ ప్రకటించలేదు..

 

ఇవి చంద్రబాబునాయుడు తాజాగా జగన్మోహన్ రెడ్డిపై  చేసిన ఆరోపణలు. ఏదో ఆరోపణలు చేయాలని చేస్తున్నట్లే ఉంది కానీ నిజమైన ప్రతిపక్ష నేతగా మాట్లాడుతున్నట్లు లేదు.  క్షేత్రస్ధాయిలో జరుగుతున్నది చూస్తు కూడా చంద్రబాబు ఇంకా జగన్ పై ఆరోపణలు చేస్తున్నాడంటే ఓర్వలేని తనంతోనే ఆరోపణలు చేస్తున్నట్లు అర్ధమైపోతోంది. జగన్ ఓ సిఎంగా వ్యవహరించటం లేదని చంద్రబాబు చెప్పటమే విచిత్రంగా ఉంది. చంద్రబాబు ఉద్దేశ్యంలో ఏమి చేయాలి ?  ఉన్నతాధికారులతో సమీక్షల పేరుతో రోజూ గంటల తరబడి వాళ్ళ బుర్రలు తినాలా ?

 

విదేశాల నుండి ఎంతమంది వచ్చారనే లెక్కలే ప్రభుత్వం దగ్గర లేదని ఆరోపించటం  కూడా అబద్ధమే. 2.5 లక్షల మంది గ్రామ, వార్డు వాలంటీర్లతో ఇల్లిల్లు సర్వేలు చేయిస్తున్న విషయం చంద్రబాబుకు తెలీదా ? విదేశాల నుండి ఎంతమంది వచ్చారో స్వయంగా జగనే లెక్కలు చెప్పిన విషయం వినలేదా ? ఎవరు విదేశాల నుండి వచ్చినా వెంటనే ప్రభుత్వానికి తెలిసేట్లుగా వాలంటీర్ల వ్యవస్ధ సమర్ధవంతంగా పనిచేస్తున్నది చంద్రబాబుకు కనబడలేదా ?

 

కేంద్రం ప్రకటించన ప్యాకేజికి అదనంగా రాష్ట్రం ఏమీ ప్రకటించటం లేదని చెప్పటం కూడా అబద్ధమే. ముందు జగన్ ప్యాకేజి ప్రకటించిన తర్వాతే కేంద్రం ప్రకటించింది. కేంద్రం 1.7 లక్షల కోట్లతో ప్యాకేజి ప్రకటించిందంటే రాష్ట్రాల నుండి వసూళ్ళు చేస్తున్న పన్నులనే తిరిగి ప్యాకేజిగా ప్రకటించింది. కానీ రాష్ట్రప్రభుత్వం అలా కాదుకదా . వసూళ్ళు చేస్తున్న పన్నుల్లోనే కేంద్రానికి పంపి మిగిలిన దానిలో నుండే కదా ప్యాకేజీ ప్రకటించాలి. ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబుకు ఇంత మాత్రం తెలీదా ?

 

దేశమంతా సంక్షోభంలో ఉన్న సమయంలో తాను అధికారంలో లేననే మంట, తన సీనియారిటిని ఎవరూ గుర్తించటం లేదనే ఉడుకుమోతుతనం చంద్రబాబులో బాగా కనబడుతోంది. ఈ ఏడుపులో నుండే జగన్ పై నోటికొచ్చిన ఆరోపణలు చేస్తున్నాడనే విషయం అందరికీ అర్ధమైపోతోంది. ఇప్పటి వరకూ రాష్ట్రంలో 11 కేసులు మాత్రమే ఉన్నాయంటే ప్రభుత్వం ఎంత సమర్ధవంతంగా పనిచేస్తుందో అర్ధం కావటం లేదా ?

 

మరింత సమాచారం తెలుసుకోండి: