ఏమి జీవితం రా స్వామి.. తు మీ బతుకు.. అని నెటిజన్లు తిట్టని తిట్టు తిట్టకుండా తిడుతున్నారు. దీనికి కారణం సైబర్ నేరగాళ్లే. ఎందుకు అని అనుకుంటున్నారా? అక్కడికే వస్తున్న.. కరోనా వైరస్ భయాన్ని క్యాష్ చేసుకుంటున్నారు సైబర్ నేరగాళ్లు. అసలు ఎం జరిగింది అంటే.. కొందరు నీచులు కరోనా వైరస్ ను ఆసరాగా తీసుకొని సైబర్ నేరాలు చేస్తున్నారు. 

 

ఇప్పటికే దేశ ప్రజలంతా కరోనా వైరస్ భయంలో ఉన్న సమయంలో ఎంతోమంది సైబర్ నేరగాళ్లు దాన్ని క్యాష్ చేసుకొని అతి తక్కువ సమయంలోనే ఎన్నో మోసాలు చేసినట్టు ఢిల్లీ పోలీసులు పసిగట్టారు. దీంతో ఢిల్లీ పోలీసులు కరోనా వైరస్ వ్యాధికి సంబంధించిన నకిలీ, హానికరమైన వెబ్‌సైట్ల‌ను తెరవవద్దని ప్రజలకు సూచించారు. 

 

ఇంకా ఈ కరోనా వైరస్ అత్యంత వేగంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో ఇలా చేస్తున్నారు అని.. కరోనా వైరస్ సంబంధిత మోసాలు బాగా పెరిగాయి అని ఢిల్లీ పోలీసులు హెచ్చరికలు జారీ చేసారు. కరోనావైరస్ స్టేటస్.స్పేస్ వెబ్‌సైట్, కరోనావైరస్-మ్యాప్.కామ్ వెబ్‌సైట్, బ్లాగ్ కరోనా సీఎల్ డాట్ కనాల్ సిరో.డిజిటల్ వెబ్‌సైట్, వ్యాక్సిన్ కరోనావైరస్.కామ్ వెబ్‌సైట్, బెస్ట్ కరోనా వైరస్ ప్రొటెక్ట్.టికె వెబ్‌సైట్, కరోనా వైరస్ అప్ డేట్ డాట్ టీకే వెబ్ సైట్ల ద్వార సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నందు వల్ల వీటిని క్లిక్ చేయవద్దని ఢిల్లీ పోలీసులు కోరారు. కాబట్టి మీరు కూడా ఈ వెబ్సైట్స్ క్లిక్ చెయ్యకండి. 

 

కాగా ఈ కరోనా వైరస్ ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ఐదు లక్షలమందికిపైగా వ్యాపించింది. అంతేకాదు ఈ కరోనా వైరస్ బారిన పడి 24 వేలమంది మృతి చెందారు.. లక్ష 25 వేలమంది కరోనా బారి నుండి తప్పించుకున్నారు. ఇలా ప్రపంచమంతా కూడా ఈ కరోనా భారిన పడి గజగజ వణికిపోతుంది. 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: