ప్రపంచ వ్యాప్తంగా కరోనా ప్రభావం ఏ స్థాయిలో ఉందో అందరికీ తెలిసిందే. భారత దేశంలో ఈ కరోనా ఎక్కువగా విదేశాల నుంచి వచ్చిన వారికే సోకింది.  ఇప్పుడు వారి నుంచి లోకల్ వాళ్లకు వ్యాప్తి చెందుతుంది. విదేశాల నుంచి వచ్చిన వారిని ఎయిర్‌పోర్టులో అధికారులు  కరోనా పరీక్షలు చేశారు. అనంతరం చేతిపై ముద్ర వేసి ఇంట్లోనే ఉండాలని చెప్పి పంపుతున్న విషయం తెలిసిందే.  దేశంలో కరోనా విస్తరిస్తుందని.. ఇప్పటికే లాక్ డౌన్ చేసిన విషయం తెలిసిందే.  ఈ నేపథ్యంలో ప్రజలు బయటకు రాకుండా ఎంతో జాగ్రత్త పడుతున్నారు.  కొన్ని చోట్ల లాక్ డౌన్ ఉల్లంఘన చేస్తున్న విషయం తెలిసిందే. అయితే మొన్నటి వరకు కరోనా వచ్చిన వారిని పరీక్షించి వారి చేతిపై ముద్ర వేశారు.

 

కానీ ఇప్పుడు మరో ట్విస్ట్ లాక్ డౌన్ ఉన్నా పదే పదే బయట తిరుగూతూ పోలీసులను ఇబ్బంది పెడుతున్న వారికి సైతం ఏకంగా నుదిటిపైనే ముద్రలు వేస్తున్నారు. ఈ విషయంలో లాక్‌డౌన్‌ను అమలు చేస్తున్నప్పటికీ దాన్ని ఉల్లంఘించి రోడ్లపై తిరుగుతున్న వారి పట్ల పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. రహదారులపైకి వచ్చిన కొందరికి జమ్మూ కశ్మీర్‌లోని రణ్‌బీర్‌ సింగ్ పురా పోలీసులు నుదిటిపై స్టాంపులు వేశారు. ఈ స్టాంపులు 15 రోజుల పాటు ఉంటాయి. కొందరికి చేతులపై కూడా ఈ స్టాంపులు వేస్తున్నారు. 'క్వారంటైన్‌ నిబంధనలను ఉల్లంఘించాడు' అని ఆ స్టాంపులపై రాసి ఉంది. సంబంధిత పోలీస్‌ స్టేషన్‌ పేరు కూడా రాసి ఉంది. 

 

పెద్ద పెద్ద నేరాలు చేసిన వారికి కూడా ఈ టైపు శిక్షలు ఉండవని.. ఇలా ఉల్లంఘించిన వారికి తర్వాత కఠిన శిక్షలు ఉంటాయని అక్కడి పోలీసులు హెచ్చరిస్తున్నారు.  కరోనా వ్యాప్తి చెందకుండా పోలీసులు, డాక్టర్లు అహర్శిశలూ శ్రమిస్తుంటే కొంత మంది ఆకతాయిలు మాత్రం పదే పదే వారి విధుల నిర్వహిణలో అంతరాయం సృష్టిస్తున్నారని ఆరోపణులు వస్తున్నాయి.  ఆ రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల పోలీసులు కూడా ఇదే తీరుతో ఉల్లంఘనదారులకు బుద్ధి చెప్పాలని భావిస్తున్నారు.  

 

 

 కరోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: