కచ్చితంగా ఇది కరోనా ను మించిన సంచలన వార్త అని చెప్పాలి. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఏ మీడియాలో చూసిన క‌రోనాకు సంబంధించిన వార్తలు హైలెట్ అవుతున్నాయి. కరోనా వైరస్ మహమ్మారి పై పోరాటం చేసేందుకు ప్రతి ఒక్కరు రాజకీయాలను పక్కన పెట్టి ప్రభుత్వానికి సహకరించాలని నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే టీడీపీ అధినేత మాజీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు సైతం ఓ నిర్ణ‌యం తీసుకున్నారు. క‌రోనా పోరాటం కార్యక్రమంలో పార్టీ శ్రేణులను కూడా భాగస్వాములను చేయాలని చంద్రబాబు నాయుడు నిర్ణయించారు. ఈ మేరకు గురువారం పార్టీ ఎమ్మెల్యేలు ఎంపీలు సీనియర్ నాయకులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.



ప్ర‌జ‌ల‌ను కాపాడే విష‌యంలో ఎవ‌రెవ‌రు అయితే ముందు ఉంటున్నారో ?  వారికి ధ‌న్య‌వాదాలు తెల‌పాల‌ని కూడా పార్టీ నాయ‌కుల‌కు.. ఎమ్మెల్యేల‌కు సూచించారు. ఈ క్ర‌మంలోనే ఎమ్మెల్యేలు.. ముఖ్య నాయ‌కులు సైతం ఇదే విష‌యాన్ని పార్టీ కేడ‌ర్‌కు కూడా చెప్పాల‌ని సూచించారు. అయితే ఈ స‌మావేశంలో బాబోరికి ఊహించ‌ని షాక్ త‌గిలింద‌ని స‌మాచారం. చంద్ర‌బాబు ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకుని నిర్వ‌హించిన ఈ స‌మావేశానికి ఎమ్మెల్యేలు ఝుల‌క్ ఇచ్చార‌ట‌. ఈ కార్యక్రమానికి కేవలం ఐదుగురు ఎమ్మెల్యేలు మాత్రమే హాజరయ్యారంట. దీనిని బ‌ట్టి చంద్ర‌బాబు మాట మీద పార్టీ నాయ‌కుల‌కు ఎంత న‌మ్మ‌కం ఉందో అర్థ‌మ‌వుతోంది.



చంద్ర‌బాబు ఇప్ప‌టికే కేడ‌ర్‌కు పూర్తిగా దూర‌మ‌వుతున్నారు. అందుకే పార్టీ పుట్టిన‌ప్ప‌టి నుంచి ఉన్న క‌ర‌ణం బ‌ల‌రాం లాంటి సీనియ‌ర్ నేత‌లు సైతం ఇప్ప‌టికే పార్టీకి దూర‌మ‌య్యారు. అందుకే 23 మంది ఎమ్మెల్యేలు గెలిస్తే ఇప్పుడు పార్టీకి కేవ‌లం 20 మంది ఎమ్మెల్యేలు మాత్ర‌మే ఆయ‌న‌కు మిగిలారు. ఇప్పుడు ఉన్న ఈ 20 మంది ఎమ్మెల్యేల్లో ఐదుగురు మాత్ర‌మే స‌మావేశానికి వ‌చ్చారంటే బాబోరి మాట మీద వాళ్ల‌కు ఎంత మాత్రం విలువ లేద‌ని అర్థ‌మ‌వుతోంది. మ‌రి ఉన్న ఈ 20 మంది ఎమ్మెల్యేలు కూడా ఎప్ప‌టి వ‌ర‌కు ఉంటారో ?  ఎప్పుడు షాక్ ఇస్తారో ?  చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: