భార‌త్‌లో కొవిడ్‌-19 కేసులు వేల సంఖ్య‌లోనే ఉండ‌బోతున్నాయా..?  ఈ వైర‌స్‌తో పెనుముప్పు పొంచి ఉందా..?  కేవ‌లం లాక్‌డౌన్ ఒక్క‌టే క‌రోనాను క‌ట్ట‌డి చేయ‌లేదా..?  అంటే అంత‌ర్జాతీయ విశ్లేష‌కులు మాత్రం ఔన‌నే అంటున్నారు. అదేమిటీ.. భార‌త్‌లో మార్చి 27వ తేదీ వ‌ర‌కు కేవ‌లం ఏడువంద‌ల‌కుపైగా మాత్రమే కొవిడ్‌-19 పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి క‌దా..? మ‌రి వేల‌ల్లో ఎలా సాధ్య‌మ‌ని మీకు సందేహం రావొచ్చు. కానీ.. ఇక్క‌డ ఒక్క‌సారి మ‌నం కొన్ని గ‌ణాంకాల‌ను చూస్తే మాత్రం మున్ముందు భార‌త్‌లో వేల సంఖ్య‌లోనే కొవిడ్‌-19 పాజిటివ్ కేసులు న‌మోదుకావ‌డం ఖాయ‌మ‌ని చెప్పొచ్చు. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం.. 

 

ఇత‌ర దేశాల‌తో పోలిస్తే.. ఇండియాలో కొవిడ్‌-19 నిర్ధార‌ణ ప‌రీక్ష‌లు చాలా నెమ్మ‌దిగా జ‌రుగుతున్నాయి. అది ఎలా అంటే.. మార్చి 25వ తేదీ రాత్రి 8గంట‌ల వ‌ర‌కు కేవ‌లం  24,254 మందిపై 25,144 ప‌రీక్ష‌లు మాత్ర‌మే నిర్వ‌హించింది. ఇది ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసిఎంఆర్) ప్రకారం. వీరిలో మొత్తం 581 మందికి మాత్ర‌మే పాజిటివ్ అని వ‌చ్చింది. అంటే నిర్ధార‌ణ ప‌రీక్ష‌ల రేట్‌.. ప‌దిల‌క్ష‌ల మందికిగాను కేవ‌లం 18మంది చొప్పున‌ మాత్ర‌మే ప‌రీక్ష‌లు చేస్తున్నార‌న్న‌మాట‌. ఈ గ‌ణాంకాలను బ‌ట్టి అర్థం చేసుకోవ‌చ్చు భార‌త్‌లో కొవిడ్‌-19 నిర్ధార‌ణ ప‌రీక్ష‌లు ఎంత స్లోగా జ‌రుగుతున్నాయో..! 

 

ఇదే స‌మ‌యంలో మిగ‌తా దేశాల్లో నిర్ధార‌ణ ప‌రీక్ష‌ల రేటింగ్ ఎలా ఉందో చూద్దాం.. ముందుగా ఇట‌లీలో చూద్దాం.. మార్చి 25వ తేదీ నాటికి 3,24,445 కొవిడ్‌-19 నిర్ధార‌ణ ప‌రీక్ష‌లు జ‌రిగాయి. ఇందులో సుమారు 74,386మందికి కొవిడ్‌-19 పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి. అంటే ఇక్క‌డ ప‌దిల‌క్ష‌ల జ‌నాభాకు గాను 5, 268మంది చొప్పున‌ ప‌రీక్ష‌లు జ‌రిగాయి. ఈ గ‌ణాంకాల‌ను బ‌ట్టి అర్థం చేసుకోవ‌చ్చు నిర్ధార‌ణ ప‌రీక్ష‌లు ఎంత వేగంగా జ‌రిగాయో..! అందుకే ఇట‌లీలో పాజిటివ్ కేసుల సంఖ్య కూడా అంతేవేగంగా పెరిగిపోయింది. ఇక యూకేలో కూడా ఇప్పటివరకు 97,019 పరీక్షలను చేప‌ట్టింది. అంటే మిలియన్ జ‌నాభాకు 1,469 మంది చొప్పున ప‌రీక్ష‌లు నిర్వహించింది. ఇందులో 9,529 పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి. 

 

 దక్షిణ కొరియాలో కూడా మిలియన్ జ‌నాభాకుగాను 6,931మంది చొప్పున 3,57,896 పరీక్షలు చేసింది. అమెరికాలో కూడా మిలియన్ జనాభాకుగాను 1,280 చొప్పున పరీక్ష‌లు జ‌రిగాయి. ఇందులో ప్రస్తుతం కోవిడ్ -19 కేసులలో దాదాపు 60,000 కేసులను నిర్ధారించింది. ఈ గ‌ణాంకాలను బ‌ట్టి..  ల‌క్ష‌ల్లో ప‌రీక్ష‌ల జ‌రిగిన దేశాల్లో పాజిటివ్ కేసుల సంఖ్య అంతేవేగంగా పెరిగింది. అందుకే చైనా, అమెరికా, ఇట‌లీ, ద‌క్షిణ కొరియా త‌దిత‌ర దేశాల్లో కొవిడ్‌-19 పాజిటివ్ కేసుల సంఖ్య వేగంగా పెరిగింది. ఈ దేశాల‌తో పోల్చిన‌ప్పుడు భార‌త్‌లో నిర్ధార‌ణ ప‌రీక్ష‌ల రేట్ చాలా చాలా త‌క్కువ‌గా ఉన్నందువ‌ల్లే.. పాజిటివ్ కేసుల సంఖ్య కూడా చాలా త‌క్కువ‌గా ఉంద‌ని విశ్లేష‌కులు అంచ‌నా వేస్తున్నారు. ఒక‌వేళ‌.. ఇప్ప‌టికే ల‌క్ష‌ల్లో నిర్ధార‌ణ ప‌రీక్ష‌లు జరిగి ఉంటే.. కొవిడ్-19 పాజిటివ్ కేసుల సంఖ్య కూడా అదే స్థాయిలో పెరిగి ఉండేద‌ని అంచ‌నా వేస్తున్నారు. చూడాలి మ‌రి ఏం జ‌రుగుతుందో..!

 

మరింత సమాచారం తెలుసుకోండి: