ప్ర‌పంచాన్ని వ‌ణికిస్తోన్న క‌రోనా వైర‌స్ చైనాలోని వుహాన్ న‌గ‌రంలో పుట్టిన సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలోనే ఆ వైర‌స్ ఇప్పుడు ప్ర‌పంచ వ్యాప్తంగా కొన్ని ల‌క్ష‌ల మందికి సోకుతూ ఎంతో మందిని చంపేస్తోంది. ఏపీలోని క‌ర్నూలు జిల్లా కు చెందిన అన్నెం జ్యోతి అనే టెక్కీ సైతం వుహాన్ లో క‌రోనా వైర‌స్ తీవ్రంగా విజృంభిస్తోన్న టైంలో ఆమె అక్క‌డే చిక్కుకుపోయింది. ఆమెకు అప్ప‌టికే ఎంగేజ్‌మెంట్ కూడా అయ్యింది. ఓ ప్రాజెక్టు నిమిత్తం వుహాన్‌కు వెళ్లిన ఆమె వైర‌స్ శ‌ర‌వేగంగా వ్యాప్తి చెంద‌డంతో అక్క‌డే చిక్కుకు పోయింది.



అస‌లు జ్యోతిని అక్క‌డ నుంచి పంపించేందుకు... చివ‌ర‌కు విమానం ఎక్కేందుకు కూడా అక్క‌డ అధికారులు ఒప్పుకోలేదు. దీంతో ఇటు జ్యోతి త‌ల్లిదండ్రుల‌తో పాటు ఆమెకు కాబోయే భ‌ర్త.. ఆమె బంధువులు అంతా తీవ్ర ఆందోళ‌న‌కు గుర‌య్యారు. చివ‌ర‌కు ఆమె క్షేమంగా తిరిగి రావాలంటూ ఆమె త‌ల్లిదండ్రులు సైతం యాగాలు.. య‌జ్ఞాలు కూడా చేశారు. ఎట్ట‌కేల‌కు జ్యోతి క‌ర్నూలుకు తిరిగి వ‌చ్చింది. వుహాన్‌లోని భ‌యంక‌ర అనుభ‌వాన్ని ఆమె చెప్పుకుంది. ఆమె ఏకంగా 26 రోజుల పాటు ఆమె చైనాలోని ఐసోలేష‌న్‌లో ఉన్నారు.



అక్క‌డ ప‌రిస్థితులు చాలా క‌ఠినంగా ఉన్నాయని... అక్క‌డ ప‌రిస్థితులు దాటుకుని వ‌స్తానా ? అన్నంత వాతావ‌ర‌ణం ఉంది. ఈ వైర‌స్ ప్ర‌బ‌ల‌కుండా ఉండాలంటే ఎవ‌రికి వారు సెల్ఫ్ క్వారంటైన్ పాటించాల్సి ఉంద‌ని ఆమె స్ప‌ష్టం చేసింది. చైనాలో క‌రోనా క‌ట్ట‌డికి ఎన్నో క‌ఠిన‌మైన ప‌ద్ద‌తులు అవ‌లంభించార‌ని.. మ‌న‌కు రోడ్ల మీద ప్ర‌జ‌లు ఎక్క‌డిక‌క్క‌డ ఉంటున్నార‌ని.. చైనాలో ఆ ప‌రిస్థితి లేద‌ని ఆమె తెలిపారు.



చైనాలో ఒక సెక్టార్‌కు ఒక హెల్ఫ్‌లైన్ నెంబ‌ర్ ఉండేది.. ఆ నెంబ‌ర్ ఫోన్ చేస్తే వాళ్ల‌కు వాళ్లే మ‌న‌కు కావాల్సిన సాయం చేసేవాళ్లు.. అక్క‌డితో కంపేరిజ‌న్ చేస్తే ఇక్క‌డ స్ట్రిక్ట్‌గా లేద‌ని జ్యోతి చెపుతోంది. అక్క‌డ సిబ్బంది కూడా ఎప్ప‌టిక‌ప్పుడు వ‌చ్చి మ‌న ఆరోగ్యం ఎలా ఉందో ?  చెక్ చేసి వెళ్లేవారని.. అక్క‌డ ప్ర‌భుత్వం నుంచి ప్ర‌జ‌ల‌కు వైద్యం .. ఇత‌ర‌త్రా సాయంలో ఎలాంటి ఇబ్బంది లేద‌ని.. ఎట్ట‌కేల‌కు తాను క్షేమంగా ఇంటికి వ‌చ్చాన‌ని త‌న అనుభ‌వాలు చెప్పింది.

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

Apple : https://tinyurl.com/NIHWNapple

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: