కరోనా వ్యాప్తికి స్పీడు పడనుందా..?? ఈ విషయాన్ని పరిశోధనాత్మకంగా శాస్త్రవేత్తలు కనిపెట్టారా..?? అంటే అవుననే అంటున్నారు మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కి చెందిన శాస్త్రవేత్తలు. కరోనా ఇకపై తన ప్రభావాన్ని చూపించలేదని తేల్చి చెప్తున్నారు. అందుకుగాను వారి పరిశోధనల విషయాలని బయటపెట్టారు. ప్రపంచంలోని వివిధ ప్రాంతాలలో ఉన్న కరోనా భాదితుల సంఖ్యని మరియు ఆ ప్రాంతాలలో గాలిలో ఉన్న  ఉష్ణోగ్రతలు గాలిలో ఉన్న తేమని పరిశీలించి పోల్చి చూశారు..

IHG

వారి పరిశోధనల ప్రకారం చూస్తే...3 నుంచీ 17 డిగ్రీల సెల్సియస్ వరకూ ఉన్న ప్రాంతాలలో కరోనా వ్యాప్తి చెందినట్టుగా తేలింది. అక్కడి ప్రాంతాలలో ఉష్ణోగ్రతలు తక్కువగా ఉండటమే కాకుండా గాలిలోని తేమ 4-9 గ్రాములు ఉన్నట్టుగా తేలిందట. ఇదిలాఉంటే సగటు ఉష్ణోగ్రత 18 డిగ్రీలకి మించి ఉండటంతో పాటు జనవరి, ఫిబ్రవరి, మార్చి మొదటి వారంలో గాలిలో తేమ 9 గ్రాముల కన్నా ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో ఈ వైరస్ కేవలం 6 శాతం మాత్రమే నమోదు అయ్యినట్టుగా తేల్చారు...ఈ క్రమంలోనే

IHG

ఋతుపవనాల ఎక్కువగా ఉండే ఆసియన్ దేశాలలో గాలిలో తేమ ఘనపు మీటరు 10 గ్రాముల కన్నా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆయా దేశాలలో కరోనా వ్యాప్తి ఎక్కువగా లేదని తెలిపారు. ఇదిలాఉంటే అమెరికాలో వేడిగా ఉండే దక్షినాది రాష్ట్రాలలో పోల్చి చూస్తే చల్లగా ఉండే ఉత్తరాది రాష్ట్రాలలో ఈ వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉన్నట్లు గుర్తు చేశారు. మొత్తానికి ఉష్ణోగ్రతలు, గాలిలో తేమ తక్కువగా ఉన్న దేశాలలోని ప్రాంతాలు ఈ మహమ్మారి నుంచీ సేఫ్ జోన్ లో ఉన్నట్టేనన్న మాట...అయితే భారత్ వంటి దేశాలలో ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఎండలు పెరిగేకొద్దీ కరోనా ప్రభావం తగ్గుముఖం పడుతుందని అంటున్నారు పరిశీలకులు..

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: