ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా ప్రభావం ముదురుతున్న సమయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నారు. కరోనాను కట్టడి  చేసేందుకు జనతా కర్ఫ్యూ ని విధించారు. కరోనాను నామ రూపాలు లేకుండా చేయాలనే ఆలోచనలో ప్రభుత్వం ఈ కర్ఫ్యూని తీసుకొచ్చింది . అంతేకాకుండా కరోనా ప్రభావం మరింత పెరుగుతుండటంతో ఏప్రిల్ 14 వరకు లాక్ డౌన్ ప్రకటించింది. 

 

 


జనతా కర్ఫ్యూ పేరుతో  ప్రజలను ఇళ్లకే పరిమితం చేసింది. మార్చి 22 నుంచి  ప్రారంభమైన ఈ కర్ఫ్యులో భాగంగా చాలా మంది ఇళ్లకే పరిమితమయ్యారు.. ఎంత కరోనా గురించి బాధ్యతలు తీసుకున్న కూడా కరోనా తన ప్రభావాన్ని చూపిస్తూనే ఉంది. అందుకే కరోనా వల్ల చాలామంది జీవినాదారం లేక అలమటిస్తున్నారు. అందుకే సినీ తారలు విరాళాలు అందిస్తూ ప్రజలను ఆదుకుంటూ వస్తున్నారు.. అయినా కూడా కరోనా పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి.. 

 

 

 

ఇప్పటికే  వైరస్ కారణంగా అన్ని రంగాలను తీవ్ర సంక్షోభంలోకి నెట్టేస్తోంది. కరోనా కారణంగా ఇప్పుడు దేశంలోని స్థిరాస్తి రంగం కుదేలైంది. హైదరాబాద్‌లో అయితే మరింత దారుణ పరిస్థితులు ఉన్నాయి. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది జనవరి-మార్చి త్రైమాసికంలో అమ్మకాలు దాదాపు 50 శాతం పడిపోవడం కలవరపెడుతోంది. దేశంలోని మరే నగరంలోనూ అమ్మకాలు ఇంత దారుణంగా పడిపోలేదు.కేవలం తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే భారీ నష్టాలు నడుస్తున్నాయి. 

 

 

 

ఇకపోతే  స్థిరాస్తి రంగం తీరుతెన్నులను ఎప్పటికప్పుడు అంచనా వేసే బ్రోకరేజీ సంస్థ ‘అనరాక్’ తన తాజా నివేదికలో ఈ విషయాన్ని వెల్లడించింది. పైన పేర్కొన్న త్రైమాసికంలో దేశంలోని ఏడు ప్రధాన నగరాల్లో నివాస గృహాల అమ్మకాలు గతేడాదితో పోలిస్తే 42 శాతం తగ్గినట్టు ఈ నివేదిక వివరించింది. గతేడాది అక్టోబరు-డిసెంబరు త్రైమాసికంతో పోల్చితే ఈ ఏడాది జనవరి-మార్చి త్రైమాసికంలో ఈ ఏడు నగరాల్లో నివాస గృహాల అమ్మకాలు 24 శాతం తగ్గినట్టు పేర్కొంది. ఇలాగే అన్నీ రాష్ట్రాల్లో కొనసాగుతున్నాయని దళారులు వాపోతున్నారు... 

మరింత సమాచారం తెలుసుకోండి: