కరోనా వైరస్.. ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన వైరస్ ఇది. ఈ వైరస్ కారణంగా ఇప్పటికే 24వేలమంది మృతి చెందారో... 5లక్షలమందికిపైగా ఈ కరోనా బారిన పడి ఆస్పత్రిపాలయ్యారు. చైనాలోని వుహాన్ నగరంలో పుట్టిన ఈ కరోనా వైరస్ ప్రపంచాన్ని చిగురుటాకులా వణికిస్తుంది. అంతలా వణికిస్తున్న ఈ కరోనా వైరస్ ప్రస్తుతం భారత్ లోకి ప్రవేశించిన సంగతి తెలిసిందే. 

 

ఇక ఈ నేపథ్యంలోనే భారత్ లోను పరిస్థితులు చేయి దాటిపోయే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తుండటంతో కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఎన్నో కఠిన నిర్ణయాలు తీసుకుంది. ఏప్రిల్ 14వ తేదీ వరుకు ప్రజలు ఎవరు కూడా వారి ఇంటి నుండి బయటకు రాకూడదు అని.. బయటకు వస్తే జైల్లో వేస్తాం అని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక దేశమంతా మొన్న బుధువారమే లాక్ డౌన్ అయ్యింది. 

 

అయినప్పటికీ కొందరు ముర్కులు బయటకు వచ్చి తందానాలు ఆడారు. అలాంటి వారిని పోలీసులు కూడా బాగానే గట్టిగ రోడ్డుపైనే కొట్టారు అనుకోండి. ఇంకా తెలంగాణాలో ప్రజలు బయటకు వస్తే జైల్లో వేస్తాం అని ఇప్పటికే సీఎం కేసీఆర్ ప్రకటించారు. కానీ ప్రజలు పట్టించుకోలేదు.. ఇప్పుడు పరిస్థితి తెలంగాణాలో ఏకంగా కరోనా పాజిటివ్ కేసులు 59కి చేరింది. ఇంకా క్వారంటైన్ లో ఏకంగా 20వేలమంది ఉన్నారు అంటా.. ఈ ఒక్క రోజే 10 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయని సీఎం కేసీఆర్ పెద్ద బాంబే పేల్చాడు. 

 

తెలంగాణలో ప్ర‌జ‌లు ఈ జాగ్ర‌త్త‌లు పాటించ‌క‌పోతే అస‌లు ఇంకా భ‌యంక‌రంగా కేసులు న‌మోదు అయ్యేవి అని అయన వ్యాఖ్యానిచ్చాడు. ఈ క‌ఠిన చ‌ర్య‌లు లేక‌పోతే పెద్ద విస్ఫోట‌నం అయ్యేది అని కేసీఆర్ చెప్పుకొచ్చాడు. అయినా తెలంగాణాలో ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ ఇలా నమోదు కావడం బాధాకరం అనే చెప్పాలి. 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: