ప్రధాని నరేంద్ర మోడీ ఈ సమయంలో ప్రధానిగా ఉండడం మంచి పరిణామమని నిత్యం ఆయన్ని వ్యతిరేకించే మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ వంటి వారు అంటున్నారంటే ఆయన పట్టుదల, చురుకుదనం విషయంలో నమ్మకాన్న్ని తెలియచేస్తున్నాయి. ఇక మోడీ దేశం నుంచి కరోనా మహమ్మారిని తరిమికొట్టడానికి గట్టి చర్యలే తీసుకుంటున్నారు. 

 

జనతా కర్ఫ్యూ తరువాత ఇప్పటికి వారం దగ్గరవుతున్నా కేసుల పెరుగుదల గణనీయంగా పెరగకపోవడానికి మోడీ అనుసరిస్తున్న వేగవంతమైన చర్యలే కారణమని చెప్పాలి. ఆయన ఏ ఒక్క రాష్ట్రాన్ని విడిగా వదిలేయడంలేదు. ప్రతీ ఒక్క కేసును కూడా తెలికగా తీసుకోవడంలేదు. డ్యాష్ బోర్డు మీద పెరుగుతున్న కరోనా కేసులను మోడీ చాలా సీరియస్ గానే తీసుకుంటున్నారు.

 

ఆయన తన వద్ద ఉన్న అన్ని రకాలైన  ఆయుధాలతో నియంత్రణ కోసం గట్టిగానే క్రుషి చేస్తున్నారు. అందులో భాగంగా ఇప్పటివరకూ రాష్ట్రాలతోని ప్రధాన కార్యదర్శులు, ఆరోగ్య  కార్యదర్శులతో కేంద్ర ప్రభుత్వ అధికారులు నేరుగా చర్చలు జరుపుతూ వస్తున్నారు. ఇపుడు వారికి తోడుగా ఏకంగా కేంద్రంలోకి మంత్రులు రంగంలోకి దిగుతున్నారు.

 

పెద్ద రాష్ట్రాలు, కరోనా ప్రభావం ఎక్కువగా ఉన్న రాష్ట్రాలకు ఇద్దరు కేంద్ర మంత్రులను, చిన్న రాష్ట్రాలకు ఒక్కో కేంద్ర మంత్రిని నియమించడం ద్వారా ఉమ్మడి వ్యూహానికి  మోడీ రెడీ అయ్యారు.ఎప్పటికపుడు ఆయా రాష్ట్రాలతో సమాచారం తెప్పించుకుంటూ మదింపు చేస్తున్నారు. అదే విధంగా రాష్ట్రాలో కొత్త కేసులు, వాటి కారణాలను కూడా అధ్య‌యనం
చేస్తున్నారు.

 

 

దేశవ్యాప్తంగా జనవరి నెల నుంచి మార్చి 23 వరకూ చూసుకుంటే  15 లక్షల‌ మంది  విదేశాల నుంచి ఇండియా వచ్చారని కేంద్రం రాష్ట్రాలకు  అతి కీలకమైన సమాచారం ఇచ్చింది. దాని ప్రకారం ఎక్కడిక్కడ ట్రేసింగ్  చేస్తూ సామూహిక వైరల్ గా కరోనా మారకుండా చర్యలు తీసుకోవాలంటూ కేంద్రం ఆదేశాలు జారీ చేస్తోంది. మొత్తానికి కరోనా నియంత్రణకు మోడీ చేపడుతున్న చర్యలు మంచి ఫలితాలు ఇస్తున్నాయి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: