తెలంగాణాలో కరోనా వైరస్ వ్యాప్తి నిరోధించడంలో ప్రభుత్వం చాలా చర్యలు తీసుకుంటుంది అని కాబట్టి ప్రజలు ఎవరూ కూడా కంగారు పడవద్దని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ అన్నారు. ఆయన శుక్రవారం సాయంత్రం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసారు. తాను ఉదయం ప్రధాని నరేంద్ర మోడీ తో మాట్లాడా అని ఆయన అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తామని చెప్పారని, అవసరం అయితే దేశం మొత్తం మీ వెంట ఉంటుంది అని మోడీ చెప్పారని కెసిఆర్ వ్యాఖ్యానించారు. తాను మోడీ తో ఎప్పటికప్పుడు ఫోన్ లో మాట్లాడుతూనే ఉన్నా అని ఆయన వివరించారు. 

 

ఇక తెలంగాణా ప్రభుత్వం తీసుకునే ప్రతీ చర్యను మోడీ కొనియాడారని అండగా ఉంటామని హామీ ఇచ్చారని ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. తెలంగాణాలో కరోనా కేసులు అదుపులోనే ఉన్నాయని కాబట్టి ప్రజలు అందరూ అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. తన జీవితంలో ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ చూడలేదని కెసిఆర్ అన్నారు. ప్రజలు అందరూ కూడా ప్రభుత్వానికి సహకరించాలని కెసిఆర్ కోరారు. రాష్ట్రంలో లాక్ డౌన్ ని వచ్చే నెల 15 వరకు కొనసాగిస్తున్నామని, రైతులు ఎవరూ కూడా కంగారు పడాల్సిన అవసరం లేదని స్పష్ట౦ చేసారు. 

 

మీ ఊరిలోకే వచ్చి పంటను కొనుగోలు చేస్తారని కెసిఆర్ అన్నారు. కాబట్టి రైతులు అందరూ సహకరించి ప్రశాంతంగా పంటను అమ్ముకోవాలని కెసిఆర్ సూచించారు. ప్రపంచం మొత్తం ఆందోళనలో ఉందని అన్నారు. కరోనా వైరస్ కి వ్యతిరేకంగా ప్రపంచం మొత్తం యుద్ధం చేస్తుందని చెప్పుకొచ్చారు. చికెన్ తింటే కరోనా రాదని, తగ్గుతుందని చికెన్ తినడం వలన కరోనా వస్తుంది అనేది తప్పు అన్నారు. ప్రజలు ఎవరూ కూడా బయటకు రావొద్దని సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేసారు. ఇతర రాష్ట్రాల కూలీలకు తాము సహకరిస్తామని, అందరి కడుపులు నింపుతామని అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: