కరోనా వైరస్ ప్రజలను ఎలా వణికిస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ కరోనా వైరస్ వ్యాప్తిని ఎవరూ కంట్రోల్ చేయలేకపోతున్నారు. నిజానికి చైనాలోని వుహాన్ నగరంలో పుట్టిన ఈ కరోనా వైరస్ చైనాను వదిలి ప్రపంచాన్ని వణికిస్తోంది. ఇంకా అలాంటి వైరస్ మన భారత్ లోకి ప్రవేశించి ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది 


 
అంతేకాదు ఈ కరోనా వైరస్ కారణంగా దేశమంతా కొన్నేళ్లు వెనక్కు వెళ్లిపోయిందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇంకా అలాంటి ఈ కరోనా వైరస్ వ్యాప్తిని నియంత్రించేందుకు మన భారత్ ప్రభుత్వం ఎన్నో కఠిన నిర్ణయాలు తీసుకుంది. ఇలానే అన్ని దేశాలు కఠిన నిర్ణయాలు తీసుకున్నప్పటికీ అక్కడ కరోనాను అదుపు చేయలేకపోతున్నారు. అగ్ర రాజ్యం అయిన అమెరికా సైతం కరోనాను కట్టడి చెయ్యలేక కష్టాలు పడుతోంది. 


 
ఇంకా ఈ నేపథ్యంలోనే పాలించేవారికే కరోనా వైరస్ రావడం ప్రస్తుతం అందరిని ఆందోళనకు గురి చేస్తుంది. ఇప్పటికే క్రికెటర్స్ కు, సింగర్స్ కు కరోనా పాజిటివ్ రాగా ఇప్పుడు ఓ ప్రధానమంత్రికే కరోనా వైరస్ పాజిటివ్ వచ్చింది. బ్రిటన్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్‌కు కరోనావైరస్ ఉన్నట్లు నిర్థారించారని డౌనింగ్ స్ట్రీట్ తెలిపింది. దీంతో ఒక్కసారిగా ఆ దేశ ప్రజలు షాక్ గురయ్యారు. 


 
కాగా ఆ బ్రిటన్ ప్రధానమంత్రికి కరోనా వైరస్ ఉంది అని అతనే ప్రకటించాడు.. ఇంగ్లండ్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ ప్రొఫెసర్ క్రిస్ విట్టీ సూచన మేరకు ప్రధానమంత్రికి పరీక్షలు నిర్వహించినట్టు అధికారికంగా ప్రకటించారు. ప్రధాని ట్విట్టర్ వేదికగా ఈ మేరకు ప్రకటన చేశరు. " అవును నాకు కరోనా వైరస్ పాజిటివ్ వచ్చింది.. నేను 24 గంటలు స్వీయ నిర్భంధంలో ఉంటాను.. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా దేశాన్ని కాపాడుకుంటాను" అని.. ఈ కరోనా వైరస్ పై మనమందరం కలిసి పోరాడాలి అంటూ అయన ట్వీట్ చేశాడు. దీంతో ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: