కరోనా వైరస్....చైనాలో పుట్టి, ప్రపంచమంతా వ్యాపించి.. ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తోంది. ఇటు ఇండియాలో కూడా ఈ కరోనా మహమ్మారి ప్రభావం పెరుగుతోంది. అయితే దేశమంతా లాక్ డౌన్ పాటించడం వల్ల, కరోనా ప్రభావం కాస్త తగ్గే అవకాశముంది. అలా కాకుండా లాక్ డౌన్ పాటించకపోతే, భారతదేశంలో కరోనా ఊహకందని విధంగా నష్టం చేకూర్చే ఛాన్స్ ఉంది. ఇక ఇదే విషయాన్ని తెలంగాణ సీఎం కేసీఆర్ స్ట్రాంగ్‌గా చెప్పారు. చైనా, అమెరికా, ఇటలీ, ఇరాన్ లాంటి దేశాల మాదిరిగా కరోనా వ్యాప్తి భారతదేశంలో ఉంటే చాలా నష్టం జరిగేదని అన్నారు.

 

కరోనా వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉన్న ఆయా దేశాల్లో తగినన్ని హాస్పిటల్స్, బెడ్స్ సౌకర్యాలు ఉన్నాయి. ఒకవేళ లేకపోయిన త్వరగా హాస్పటల్స్ ఏర్పాటు చేసుకునే సాంకేతికత వారికి ఉంది. అయితే మన దేశంలో అలాంటి సౌకర్యాలు తక్కువ, కాబట్టి ఎక్కువమంది కరోనా బారిన పడితే చాలా ఇబ్బందులు ఎదురవుతాయి. పైగా అమెరికా, చైనా, ఇటలీ స్థాయిలో ఇండియాలో వ్యాపిస్తే 20 కోట్ల మంది కరోనా బారిన పడతారని నిపుణులు అంటున్నారు.

 

కాకపోతే కరోనా వైరస్ ప్రభావం ఎక్కువయ్యేవరకు ఆయా దేశాలు మేల్కొలేదు. పెద్ద ఎత్తున వైరస్ వ్యాపించక చర్యలు తీసుకోవడం మొదలుపెట్టారు. కానీ మన దేశంలో మాత్రం ముందే జాగ్రత్త చర్యలు చేపట్టారు. కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు ఒక్కసారిగా జనతా కర్ఫ్యూ పెట్టారు. అలాగే 21 రోజుల పాటు లాక్ డౌన్ పాటిస్తున్నారు.

 

దీని వల్ల ప్రజల అత్యవసర సమయాల్లో తప్ప, మిగతా సమయం అంతా ఇంట్లోనే ఉండటం వల్ల, కరోనా ఉదృతి తగ్గనుంది. ఇక ఇదే విషయాన్ని పి‌ఎం మోడీతో సహ మన రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలు పదే పదే ప్రజలకు వివరిస్తున్నారు. రోజురోజుకూ కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలందరూ ఇళ్ళల్లోనే ఉంటేనే వైరస్ వ్యాప్తిని అడ్డుకోగలం. లేదంటే ప్రమాదం ఏ స్థాయిలో ఉంటుందో ఊహించడం కష్టం.

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple https://tinyurl.com/NIHWNapple

మరింత సమాచారం తెలుసుకోండి: