దేశంలో మొన్నటి ఆదివారం నాడు భారత ప్రధాని నరేంద్ర మోదీ సూచనల మేరకు ‘జనతా కర్ఫ్యూ ’ పాటించిన విషయం తెలిసిందే.  ఈ నేపథ్యంలో భారత దేశ వ్యాప్తంగా అందరూ జనతా కర్ఫ్యూ పాటించి ఐదు గంటలకు డాక్టర్లు చేస్తున్న సేవకు సంఘీభావం ప్రకటిస్తూ చప్పట్లో కొట్టారు.  ఆ సాయంత్రమే తెలుగు రాష్ట్ర సీఎం లు ఈ నెల 31 వరకు లాక్ డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే.  అయితే లాక్ డౌన్ ప్రకటించినప్పటికీ కొంత మంది రోడ్లపై యథేచ్చగా తిరుగుతూనే ఉండటంపై సీఎం కేసీఆర్ ఫైర్ అయ్యారు.  తెలంగాణాలో వరుస కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఇది వరకు 49 పాజిటివ్ కేసులు నమోదుకాగా ఈ ఒక్కరోజే ఏకంగా 10 కొత్త పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

 

ఈ నేపథ్యంలో ముఖ్య మంత్రి కేసీఆర్ మీడియా సమావేశం ఏర్పాటు చేసారు.  ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలకు తమ ఆరోగ్య పరిస్థితి గురించి ఆలోచించుకోవాలని.. తప్పనిసరి పరిస్థితుల్లో తెలంగాణలో ఈ నెల 31 వరకూ అమలులో ఉన్న లాక్ డౌన్, కర్ఫ్యూలను మరో 15 రోజుల పాటు పొడిగిస్తున్నామని ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యానించారు.  తెలంగాణలో లాక్ డౌన్ సంపూర్ణంగా అమలవుతోందని వ్యాఖ్యానించిన ఆయన, ఇదే స్ఫూర్తిని మరో 20 రోజులు చూపాలని ప్రజలను కోరారు.

 

కరోనా వైరస్ పై మంత్రులు, అధికారులతో సమీక్ష అనంతరం కేసీఆర్ మీడియాతో మాట్లాడారు. ప్రజలంతా ప్రభుత్వానికి సహకరించాలన్నారు. పశు గ్రాసం,పౌల్ట్రీ ఫీడ్ వాహనాల కు అనుమతి ఇస్తున్నట్టు అయన తెలిపారు. నిత్యావసర వస్తువుల వాహనాల కు అనుమతి ఇస్తున్నామన్నారు. చికెన్ తినడం వల్ల కరోనా వస్తుందని తప్పుడు ప్రచారం చేస్తున్నరని నిజానికి చికెన్ తినడం వల్ల రోగనిరోధక శక్తిపెరుగుతుందన్నారు.  అంతే కాకుండా సి విటమిన్ లభించే పండ్లు తినాలని సూచించారు. ఆ పండ్లను ఇతర రాష్ట్రాలకు పంపకూడదని ఆదేశించారు. ఈ కొన్ని రోజుల వరకు మనం ఒళ్లు జాగ్రత్త పెట్టుకొని ఆరోగ్యాన్ని కాపాడుకుంటే భవిష్యత్ ఉంటుందని అన్నారు. 

 

 కరోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: