ఏపిలో ప్రతిపక్షాలను జగన్మోహన్ రెడ్డి గుర్తించాలంటూ ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబునాయుడు మొత్తుకుంటున్నాడు. ఓడిపోయిన దగ్గర నుండి ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టినా చంద్రబాబు ఇదే విషయాన్ని పదే పదే డిమాండ్ చేస్తుండటమే విచిత్రంగా ఉంది. ఇదే చంద్రబాబు అధికారంలో ఉన్నపుడు రాష్ట్రంలో అసలు ప్రతిపక్షాలే అవసరం లేదు పొమ్మన్నాడు. ఏ విషయంలో అఖిలపార్టీ సమావేశం నిర్వహించమని ప్రతిపక్షాలు అడిగానా తనకు చేతకాకపోతే కదా ప్రతిపక్షాలతో సమావేశం పెట్టడమంటూ దబాయించిన సందర్భాలు చాలానే ఉన్నాయి.

 

అలాంటి చంద్రబాబుకు ఇపుడు చేయటానికి ఏమీ పనిలేకపోవటంతో జగన్ ప్రతిపక్షాలతో సమావేశాలు నిర్వహించాలంటూ ప్రతి చిన్న విషయానికి డిమాండ్ చేస్తున్నాడు. సరే చరిత్రను వదిలిపెట్టేసినా  కొరోనా వైరస్ విజృంభిస్తున్న నేపధ్యంలో జగన్ ను దేబిరించటం ఏమీ బావోలేదు. ఒకవైపు వైరస్ ను  నియంత్రించటంలో జగన్ ప్రభుత్వం బాగానే పనిచేస్తోంది. అధికారంలోకి రాగానే ఏర్పాటు చేసిన గ్రామ, వార్డు వాలంటీర్ల వ్యవస్ధ జగన్ కు బాగా కలిసొచ్చింది. వాలంటీర్లందరూ బ్రహ్మాండంగా పని చేస్తుండటంతో వైరస్ అనుమానితుల వివరాలు, విదేశాల నుండి వచ్చిన వాళ్ళ వివరాలు ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు అందుతున్నాయి.

 

అసలు చంద్రబాబు బాధేమిటంటే ప్రపంచంతో పాటు యావత్ దేశం సంక్షోభంలో కూరుకుపోతున్న సమయంలో తాను ప్రతిపక్షంలో కూర్చోవటాన్ని చంద్రబాబు తట్టుకోలేకపోతున్నాడు. జగన్ దెబ్బకు చంద్రబాబును పట్టించుకునే వాళ్ళే కనబడటం లేదు. దాంతో జగన్ పై ఉక్రోషం కూడా పెరిగిపోతోంది. అందుకనే ఏదో ఓ కారణం కల్పించుకుని ప్రతిరోజు జాతినుద్దేశించి ప్రసంగిస్తున్నాడు.

 

కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు పెట్టిన ఆంక్షల కారణంగా బయట తిరిగేందుకు లేదు. జనాల్లోకి వెళ్ళేందుకు లేదు. దాంతో ఇంట్లో కూర్చుని ఏమి చేయాలో చంద్రబాబుకు అర్ధం కావటం లేదు. అందుకనే ఏదో ఓ రకంగా జగన్ పై ఒత్తిడి తెచ్చి కొరోనా వైరస్ నియంత్రణలో అర్జంటుగా పని కల్పించుకుని జనాల్లో తిరగాలన్నదే చంద్రబాబు ఆలోచనగా కనబడుతోంది. అందుకనే బ్బాబ్బాబు ప్రతిపక్షాల సేవలను కూడా ఉపయోగించుకోమని జగన్ బతిమలాడుకుంటున్నాడు.

 

 

 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: