లాక్ డౌన్ పేరుతో రెండు తెలుగు రాష్ట్రాల్లో చాలా చోట్ల పోలీసులు అత్యుత్సాహం చూపిస్తున్నారు. ఇప్ప‌టికే క‌రోనా వైర‌స్ విజృంభ‌ణ నేప‌థ్యంలో రెండు తెలుగు రాష్ట్రా సీఎంలు అయిన కేసీఆర్‌.. జ‌గ‌న్ ఇద్ద‌రూ కూడా రైతులు పొలం ప‌నులు చేసుకునే విష‌యంలో మిన‌హా యింపు ఇచ్చారు. రైతుల‌ను ఎవ్వ‌రూ ఎలాంటి ఇబ్బందులు కూడా పెట్ట‌వ‌ద్ద‌ని చెప్పారు. తెలంగాణ సీఎం కేసీఆర్ తో పాటు ఇటు ఏపీ సీఎం జ‌గ‌న్ సైతం రైతులు పంట‌లు చేతికి వ‌చ్చినందున వారు పొలం ప‌నులు చేసుకుంటార‌ని.. వీరికి ఇబ్బందులు క‌లిగించ వ‌చ్చ‌ని చెప్పారు.

 

అయితే ఏపీలోని ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలో పోలీసులు అత్యుత్సాహం ప్ర‌ద‌ర్శించారు. ప్ర‌భుత్వ ఆదేశాల‌ను ప‌ట్టించు కోకుండా పోలీసుల అత్యుత్సాహం చూపించారు. రైతుల‌పై దాడులు చేస్తున్నారు. ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా పెంట‌పాడు మండ‌లం రావిపాడు గ్రామంలో పోలీసులు వ్య‌వ‌సాయం చేసుకుంటోన్న రైతుల‌పై విచ‌క్ష‌ణా ర‌హితంగా దాడులు చేసిన‌ట్టు స‌మాచారం. ఇప్ప‌టికే పోలీసులు రైతులపై దాడులు చేస్తుండ‌గా.. వారి పోయాక వారి బైక్‌ల‌ను ఇనుప రాడ్లు ప‌ట్టుకుని.. లాఠీలు ప‌ట్టుకుని ధ్వంసం చేసిన వీడియోలు సైతం మీడియా లోనూ.. సోష‌ల్ మీడియాలోనూ వైర‌ల్ అవుతున్నాయి.

 

ఇక పోలీసులు దాడి చేశాక రైతులు పారిపోవ‌డంతో అక్క‌డే ఉన్న బైకులపై త‌మ ప్ర‌తాపం చూపించి అద్దాలు ప‌గ‌ల‌గొట్టారు. ఇక పోలీసుల తీరుపై రైతుల ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. రైతుల‌ను ఇబ్బంది పెట్ట‌వ‌ద్ద‌ని సాక్షాత్తూ సీఎం చెప్పినా పోలీసులు త‌మ‌పై దాడులు చేయ‌డం క‌రెక్ట్ కాద‌ని వారు వాపోతున్నారు. ఇప్ప‌టికే ఈ విష‌యాన్ని వారు వ్య‌వ‌సాయ శాఖా మంత్రి క‌న్న‌బాబు దృష్టికి తీసుకు వెళ్లారు. ఇక పోలీసులు తీవ్ర అత్యుత్సాహం చూపించార‌ని వారంతా తీవ్ర ఆవేద‌న‌తో ఉన్నారు. ఇప్ప‌ట‌కి అయినా సంబంధిత శాఖా మంత్రి అయిన క‌న్న‌బాబుతో పాటు జిల్లా పోలీసు శాఖ ఉన్న‌తాధికారులు రైతుల‌పై దాడులు చేసిన పోలీసుల‌పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ప‌లువురు కోరుతున్నారు.

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

Apple : https://tinyurl.com/NIHWNapple

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: