దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తిని నియంత్రించేందుకు భారత ప్రభుత్వం సంచలన నిర్ణయాన్ని తీసుకుంది. జనతా కర్ఫ్యూ పేరుతో  ప్రజలను ఇళ్లకే పరిమితం చేసింది. మార్చి 22 నుంచి  ప్రారంభమైన ఈ కర్ఫ్యులో భాగంగా చాలా మంది ఇళ్లకే పరిమితమయ్యారు. అంతేకాకుండా కరోనా ప్రభావం మరింత పెరుగుతుండటంతో ఏప్రిల్ 14 వరకు లాక్ డౌన్ ప్రకటించింది. 

 

 


ఈ సందర్బంగా తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు జనాలను బయటకు తిరగ కూడదని నిర్ణయించింది. అయినా కొందరు బయట తిరుగుతున్నారు. అలాంటి వారికి పోలీసులు కరోనా పై లాక్ డౌన్ పై అవగాహన తెలుపుతున్నారు. అంతేకాకుండా బయటకు రాకూడదని సూచిస్తున్నారు. పరిశుభ్రంగా ఉంటూ కరోనా వ్యాప్తిని తాగ్గించే ప్రయత్నం చేయాలనీ ప్రభుత్వం నిర్ణయించింది. 

 

 


అయితే, ప్రజలను ఆదుకోవడానికి సినీ తారలు ముందుకొస్తున్నారు. ఇప్పటికే పలువురు సినీ రాజకీయ ప్రముఖులు తోచిన సాయాన్ని అందిస్తూ వస్తున్నారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలిగించరాదని వారు ముందుకొస్తున్నారు. అయితే ఎక్కడ కరోనా కేసులు తగ్గిన దాఖలు కనపడుటలేదు. తెలుగు రాష్ట్రాల్లో చాలా కరోనా కేసులు నమోదు అవుతున్నాయి. 

 

 


ఈ మేరకు ప్రజల పరిస్థితులు తెలుసుకోవడానికి తెలంగాణ సర్కారు ఆదేశాల మేరకు బీజేపీ నేతలు ఒక్కొక్కరుగా ముందుకొస్తున్నారు. తెలంగాణలో లాక్‌డౌన్ పకడ్బందీగా కొనసాగుతోంది. ముఖ్యంగా హైదరాబాద్‌లో కఠినంగా అమలు చేస్తున్నారు పోలీసులు. లాక్‌డౌన్ ఎఫెక్ట్‌తో ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. చాలా చోట్ల సామాజిక దూరం పాటిస్తూ కరోనాపై పోరాటానికి సహకరిస్తున్నారు. 

 

 


ఈ నేపథ్యంలో  బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కూడా పెద్ద మనసు చాటుకున్నారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో అత్యవసరంగా ఆస్పత్రులకు వెళ్లాల్సిన వారికి, వృద్ధులకు తన వంతుగా సాయం చేస్తున్నారు. ఎమర్జెన్సీ సేవల కోసం మూడు కార్లు అందుబాటులో ఉంచామని.. ఎవరికి అవసరం ఉన్నా, ఫోన్ చేసిన 10 నిమిషాల్లో వారి ఇంటికి చేరుకుంటుందని చెప్పారు రాజాసింగ్. గోషామహల్‌ పరిధిలో ఉన్న ప్రజలు తనను నేరుగా సంప్రదించవచ్చని సూచించారు.ఈ విషయాన్నీ సోషల్ మీడియా ద్వారా పేర్కొన్నారు.. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: