ప్రస్తుతం భారతదేశంలో కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ప్రజలు అందరూ ఇళ్లలోనే ఉంటున్నారు. ఐతే ఏప్రిల్ 14 తర్వాత ప్రజలందరికీ బయట జరిగే స్వేచ్ఛ లభిస్తుందని తెలుస్తుంది. ఇక ఆ సమయంలో మీ పిల్లలు హాయ్ గా బయట తిరుగుతూ వారి స్నేహితులతో ఆటలు ఆడతారు. ఐతే అలా ఆటలాడే మీ పిల్లల కోసం మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఈ ఆర్టికల్ ద్వారా తెలియజేస్తున్నాం. ఇంకా ఏప్రిల్ నెల రాకముందే ప్రస్తుతం ఎండ తీవ్రత ఘోరంగా తయారైంది. మూడు వారాలు గడిస్తే తీవ్రత మరీ ఎక్కువ అయ్యే అవకాశం ఉంది. అందుకే ఇటువంటి ఎండ తీవ్రత లో మీ పిల్లలను మీరు ఎక్కువగా బయటకు పంపించకుండా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. రోజుకి రెండుసార్లు స్నానం చేయించి చెమటని బాగా పీల్చే వస్ర్తాలను వారికి ధరించాలి. ఎండ తీవ్రత ఎక్కువగా లేని చెట్ల కింద ప్రదేశాలలో మీ పిల్లలని ఆడుకునేలా చూసుకోవాలి.

 




ఉదయం పూట ఆహారం లో రాగి, సజ్జలు పెరుగులో కలిపి ఇవ్వడం వలన మీ పిల్లలు అలసి పోకుండా ఉంటారు. అనంతరం వారికి నిమ్మరసం లాంటి శీతలపానీయాలు తాగించండి. అలాగే వారు ఈ వేసవి కాలంలో ఎక్కువగా చిరుతిండ్లు తినడానికి ఇష్టపడుతుంటారు. మీరు ఆ చిరుతిండ్లలో ఎక్కువగా ఖర్జురా, అనాస కాయ, పుచ్చకాయ, కొబ్బరి నీళ్లు నిమ్మరసం ఉండేలా చూసుకోండి. అలాగే ఉప్పు, నూనె లాంటివి తక్కువగా ఉండేటట్టు చూడండి. మీ పిల్లవాడి శరీరం నుండి చెమట రూపంలో కోల్పోయిన లవణాలను మళ్లీ వారికి తిరిగి అందించేలా.. మజ్జిగ నిమ్మరసం ఎక్కువగా తాగించండి.




ఇకపోతే మీ పిల్లలకు ఈ వేసవి కాలంలో ఒక కొత్త స్కిల్ ని నేర్పించడానికి ప్రయత్నించండి. వారు ఆ స్కిల్ లో కొంచెం ప్రోగ్రెస్ చూపించిన విపరీతంగా పొగడండి. అలా చేయడం వలన వారు ఆ స్కిల్ ని ఎంతో ఆసక్తికరంగా నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇలా ఈ వేసవి కాలాన్ని మీ పిల్లలు అనారోగ్యానికి కారణం అవ్వకుండా చూసుకోండి

మరింత సమాచారం తెలుసుకోండి: