ప్ర‌పంచ మ‌హ‌మ్మారి కరోనా వైరస్ ని కట్టడి చేసేందుకు దేశ వ్యాప్తంగా ఉన్న ఎంతో మంది ప్ర‌ముఖులు.. రాజ‌కీయ నాయ‌కులు.. సినిమా సెల‌బ్రిటీలు.. పారిశ్రామిక వేత్త‌లు ఇలా ఎవ‌రికి వారు త‌మ‌కు తోచిన‌ట్టుగా భారీ విరాళాలు ఇస్తున్నారు. మ‌న రెండు తెలుగు రాష్ట్రాల్లో పారిశ్రామిక వేత్త‌లు.. రాజ‌కీయ నాయ‌కులు సైతం భారీ ఎత్తున సీఎం రిలీఫ్ ఫండ్‌కు విరాళాలు ఇస్తున్నారు. ఇక మ‌న దేశంలో క‌రోనా దెబ్బ‌తో అత‌లా కుత‌లం అవుతోన్న రాష్ట్రం మ‌హారాష్ట్ర. దేశం మొత్తం మీద ఎక్కువ కేసులు న‌మోదు అయిన రాష్ట్రం ఏదైనా ఉంది అంటే అది మ‌హారాష్ట్రే అని చెప్పాలి.

 

ఈ క్ర‌మంలోనే ఇప్పుడు ఆ రాష్ట్ర ప్ర‌భుత్వానికి ప‌లువురు సినిమా సెల‌బ్రిటీలు.. పారిశ్రామిక వేత్త‌లు భారీ విరాళాలు ఇస్తున్నారు. తాజాగా షిర్డీ సంస్థాన్ ట్రస్ట్ సైతం భారీగా విరాళం ప్రకటించింది. మహారాష్ట్ర సీఎం రిలీఫ్ ఫండ్‌కు రూ.51 కోట్లు అందజేస్తున్నట్లు షిర్టీ సంస్థాన్ ఒక ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది. ఇక మ‌హారాష్ట్ర‌ను అత‌లా కుత‌లం చేస్తోన్న క‌రోనా మ‌హ‌మ్మారిపై పోరాటం చేసేందుకు రాష్ట్రంలో ఉన్న ప్ర‌జ‌లు అంద‌రూ చేయి చేయి క‌ల‌పాల‌ని ప్రజలకు పిలుపు నిచ్చింది. 

 

కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించిన వివరాల ప్రకారం దేశ వ్యాప్తంగా 724 కరోనా పాజిటివ్‌ కేసులు ఉండగా మహారాష్ట్రలో 130 కేసులు నమోదయ్యాయి. ఈ క్ర‌మంలోనే షిర్డీ సంస్థాన్ ముందుకు వ‌చ్చి భారీ విరాళం ఇవ్వ‌డంతో ప్ర‌తి ఒక్క‌రు మెచ్చుకుంటున్నారు. ఇక మ‌హారాష్ట్ర‌లో క‌రోనా మహమ్మారి భారిన పడిన వారిలో 15 మంది కోలుకోగా ఇప్పటివరకు అక్కడ నాలుగు మరణాలు చోటుచేసుకున్నాయి. ఇక ఇప్ప‌టి వ‌ర‌కు క‌రోనా పాజిటివ్ వ‌చ్చిందా ?  లేదా ? అని తెలుసుకునేందుకు కేవ‌లం పూణేలో మాత్ర‌మే టెస్టులు నిర్వ‌హించే వారు. ఇక‌పై 18 ర‌కాల టెస్ట్ కిట్లు అందుబాటులోకి రావ‌డంతో కాస్త ఊర‌ట ల‌భించిన‌ట్ల‌య్యింది.

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

Apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: