ప్రపంచాన్ని పట్టి పీడస్తున్న కరోనా వైరస్ రోజు రోజు కీ పెరిగిపోతూనే ఉంది.  ప్రస్తుతం కరోనా వైరస్ ని అరికట్టేందుకు కేంద్రం లాక్ డౌన్ ఆదేశాలు జారీ చేశాయి.  తాజాగా కరోనాని కట్టడి చేయకుంటే..  భారీ నష్టం తప్పదని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు హెచ్చరించారు. కరోనా సోకిన ఓ వ్యక్తి ఆరు రోజుల పాటు సమాజంలో తిరిగితే 3200 అతని వల్ల ఈ వ్యాది సోకిందని అన్నారు.  ఈ విషయం చైనాలో గవర్నర్ అధ్యయన పూర్వకంగా చెప్పారని, ఇలాంటి వాస్తవాలను విస్మరిస్తే భారీగా మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని అభిప్రాయపడ్డారు.  ఇప్పుడు మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉందని అన్నారు. 

 

ప్రతి ఒక్కరూ విధిగా ఇంటి పట్టున ఉండాలని అన్నారు.  ఇలాంటి తరుణంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతో బాధ్యతతో వ్యవహరించాలని, ఓ తుపాను కానీ, ఓ భూకంపం కానీ సంభవిస్తే అది ఒక ప్రాంతానికే పరిమితం అవుతుందని, కానీ కరోనా అలా కాదని, ప్రపంచాన్ని కబళించివేస్తుందని స్పష్టం చేశారు.   ఈ సమయంలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా వహించాల్సిన అవసరం ఉందని అన్నారు.  రోడ్లపైకి ఎవరూ రావొద్దని ఒకవేళ తప్పని సరి పరిస్థితిలో అయితే ఇంటిలో నుంచి ఒక్కరు రాావాలని అన్నారు.   ఇలాంటి క్లిష్ట సమయంలో ఎక్కడివాళ్లు అక్కడ ఉంటేనే శ్రేయస్కరం అని స్పష్టం చేశారు. రాష్ట్రాల సరిహద్దుల వద్దకు వచ్చి ఇబ్బందులు కలిగించకూడదని విజ్ఞప్తి చేశారు. 

 

ప్రభుత్వాలు, ప్రతిపక్షాలు స్వచ్ఛంద సేవాసంస్థలు, వ్యక్తులు కలిసికట్టుగా పనిచేయాల్సిన సమయం అని, ఇక్కడ రాజకీయాలకు తావులేదని అన్నారు. ఇప్పటివరకు సంభవించిన మరణాలు చూస్తుంటే పురుషులే అత్యధికస్థాయిలో వాహకాలుగా ఉన్నట్టు అర్థమవుతోందని అన్నారు. కరోనా మహమ్మారి వయసును బట్టి ప్రభావం చూపిస్తుందని, 80 ఏళ్లు పైబడినవారు జాగ్రత్తగా ఉండాలని, చనిపోయినవారిలో 14 శాతం ఈ వయసు వాళ్లే ఉన్నారని తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: