కరోనా ఇప్పట్లో తన తాకిడిని తగ్గించేలా లేదు. వైరస్ దేశం, ప్రాంతం, వాతావరణం, సరిహద్దు అంటూ భేదం లేకుండా కనబడిన ప్రదేశాన్ని అంతా వల్లకాడ చేసేదాకా వదిలిపెట్టడం లేదు. ఇప్పటికే ఆస్ట్రేలియాలో మరియు ఫ్రాన్స్ లో ముఖ్య పదవిలో ఉన్న ఎంతో మంది మంత్రులకు, అధ్యక్షులకు వైరస్ సోకడం చూశాం. అయితే రోజు బ్రిటన్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ కు కరోనా పాజిటివ్ అని తేలడంతో ప్రపంచవ్యాప్తంగా ప్రకంపనలు మొదలయ్యాయి.

 

అలా జరిగిన కొద్దిసేపటికే ఇంగ్లాండ్ యొక్క వైద్య శాఖ మంత్రి మ్యాట్ హ్యాంకాక్ కు కూడా కరుణ పాజిటివ్ అని తేలడం ఇప్పుడు ప్రపంచ దేశాలన్నింటికీ వణికిస్తోంది. దేశంలోని అత్యున్నత పదవిలో ఉన్న ప్రధానమంత్రి మరియు వైద్య శాఖ మంత్రి ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నా కూడా వారికి కరోనా వైరస్ పెట్టకపోవడంతో బ్రిటన్ వాసులంతా ఇప్పుడు ఏం చేయాలో తెలియక బిత్తర చూపులు చూస్తున్నారు. మామూలుగానే అత్యున్నత వైద్య సదుపాయం కలిగిన బ్రిటన్ లో రోజుకి వందలాది ప్రజలు వైరస్ సోకి చనిపోతుంటే ఇప్పుడు కొత్తగా ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా వైరస్ దేశంలోని పెద్ద పదవుల్లో ఉన్న వారినీ వదిలిపెట్టకపోతే మామూలు జనం సంగతి ఏంటి అంటూ వాపోతున్నారు.

 

ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎన్ని రోజులు లాక్ డౌన్ చేసినా, కర్ఫ్యూ విధించినా కూడా దానివల్ల ప్రయోజనం ఏమీ లేకుండా ఉండడం గమనార్హం. ఇకపోతే వైరస్ ను అరికట్టేందుకు శాస్త్రవేత్తలు ఎంత త్వరగా వ్యాక్సిన్ ను కనిపెడితే అంత మంచిది అని ప్రజలంతా ఆశాభావంతో ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: