ప్రపంచం మొత్తం వీరవిహారం చేస్తూ, ప్రాణాలు తీస్తున్న మహమ్మారి బారి నుండి తప్పించుకోవడానికి భారతదేశం లాక్ డౌన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీని వల్ల ఉద్యోగాలకు వెళ్లలేక, నెలవారీ ఖర్చును ఎలా భరించాలో అర్థం కాక, ఈఎంఐ బిల్లులు, క్రెడిట్ కార్డు బిల్లులు ఎలా కట్టాలో తెలియక మధనపడుతున్న వారికి ఇది ఒక శుభవార్త అనే చెప్పాలి. కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో ఆర్థిక స్థిరత్వం, ఆర్థిక వృద్ధిని మెరుగుపరచడం కోసం రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది.

 

 

రెపో రేటును 75 బేసిస్ పాయింట్ల మేర తగ్గించింది. దీంతో ఈ రేటు 4.4 శాతానికి దిగొచ్చింది. అంతేకాకుండా రుణ ఈఎంఐలపై 3 నెలల పాటు మారటోరియం విధించింది. ఇది హోమ్ లోన్, పర్సనల్ లోన్, వెహికల్ లోన్, పంట రుణాలు వంటివి అన్నీ రుణాలకు వర్తిస్తుంది. బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలు, హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలన్నీ తమ కస్టమర్లకు ఈఎంఐ మారటోరియం ప్రయోజనాన్ని అందుబాటులో ఉంచనున్నాయి. ఇదిలా ఉండగా, ఇప్పుడు క్రెడిట్ కార్డు బకాయిల సంగతేంటి? అనే ప్రశ్న అందరిలో నెలకొంది. తాజాగా ఆర్‌బీఐ క్రెడిట్ కార్డు బకాయిలపై కూడా స్పష్టతనిచ్చింది.

 

 

కరోనాపై సెల్ఫ్ అసెస్మెంట్ టెస్ట్ :

 

NIHWN  వారి సంజీవన్ మీకు కల్పిస్తోన్న ఈ అవకాశం.. కరోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 

 

రుణాలకు లాగానే క్రెడిట్ కార్డు బకాయిలకు కూడా ఈఎంఐ మారటోరియం రూల్స్ వర్తిస్తాయని స్పష్టం చేసింది. నెలవారీ ఈఎంఐలతో పాటు క్రెడిట్ కార్డు బకాయిలు కూడా మారటోరియం కిందకు వస్తాయని తెలిపింది. దీని వల్ల క్రెడిట్ కార్డు దారులకు చాలా ఊరట కలుగుతుందనే చెప్పవచ్చు.  రానున్న రోజుల్లో భారతదేశం కరోనాను ఎలా ఎదుర్కుంటుందనే అంశంపైనే భవిష్యత్ వృద్ధి ఆధారపడి ఉంటుందని ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ తెలిపారు. దీనివల్ల అయినా మధ్య తరగతి ప్రజలకు కొంత ఊరట కలుగుతుందని పలువురు ఆర్థిక నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: