కరోనా వైరస్ కారణంగా చైనీయులు ఆహారపు అలవాట్లు ప్రపంచ వ్యాప్తంగా చర్చకు దారి తీస్తున్నాయి. ఏకంగా అమెరికా అధ్యక్షుడే చైనా వాళ్లు పచ్చి మాంసం తినే ఆహారపు అలవాట్ల వల్లే కరోనా వచ్చిందని విమర్శించారు. అందుకే కరోనాను చైనా వైరస్ అంటూ ఆయన ఎద్దేవా చేశారు. కరోనా వైరస్ తర్వాత చైనా వాళ్లు పుడ్ హ్యబిట్స్ పై బాగా వీడియోలు వైరల్ అయ్యాయి. అనేక వార్తలు చర్చకు దారి తీస్తున్నాయి.

 

 

అయితే చైనాకు సంబంధించిన ఆహారపు అలవాట్ల విషయంలో అనేక ఆసక్తికరమైన విషయాలు వెలుగు చూస్తున్నాయి. మొన్న చైనాలో కరోనా వైరస్ కు కేంద్ర బిందువుగా నిలిచిన వుహాన్ చైనాలోనే మాంసాహార మార్కెట్లకు పెట్టింది పేరు. అయితే సాధారణంగా ఏ దేశంలోనైనా వన్యప్రాణులను వేటాడటం చాలా నేరంగా భావిస్తారు. మన దేశంలో ఈ రూల్స్ చాలా కఠినంగా ఉంటాయి. నెమలి మాంసం అమ్మినట్టు తెలిసినా.. కనీసం వేటాడినట్టు తెలిసినా కేసులు పెట్టి సంవత్సరాల తరబడి జైల్లో తోస్తారు.

 

 

కానీ చైనాలో మాత్రం ఆ ఇబ్బందులు లేవు. ఎందుకంటే అక్కడి చట్టాలు వేటగాళ్లకు చాలా అనుకూలంగా ఉంటాయి. 1989లో చైనా వన్యసంరక్షణ చట్టంలో వేటగాళ్లు అనుకూలమైన చాలా క్లాజులు ఉన్నాయట. అందులో జంతువులు మనుషుల ప్రయోజనానికి ఉపయోగపడే వనరులుగా చెప్పారట. అంతే కాదు.. ఆ తర్వాత 2016లో చేసిన సవరణలో దీనికి మరింత చట్టబద్దత కూడా కల్పించారు.

 

 

అంతేకాదు... చైనా దేశంలో సంప్రదాయ వైద్యానికి చాలా ప్రాధాన్యంత ఇస్తారు. అధికారికంగానే దీనికి గుర్తింపు ఉంది. చైనా సంప్రదాయ వైద్యాన్ని ప్రోత్సహిస్తోంది కడా. అందులో వన్యప్రాణుల రక్తం, మర్మాంగాలను ఎక్కువగా వాడుతుంటారు. ఇప్పుడు అదే ప్రపంచం కొంప ముంచుతోందని చాలా మంది విమర్శిస్తున్నారు.

 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN
వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

Apple : https://tinyurl.com/NIHWNapple

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: