క‌రోనా ఎఫెక్ట్ ఇప్ప‌టికే ఎన్నో రంగాల‌పై ప‌డింది. ఈ క్ర‌మంలోనే క‌రోనా వైర‌స్ ప్ర‌భావం దేశంలో ఉన్న ఎన్నో దేవాల‌యాల‌పై ప‌డింది. అటు దేవాల‌యాలు.. మ‌సీదులు.. చ‌ర్చిలు ఇలా చెప్పుకుంటూ పోతే అన్ని దేవాల‌యాల్లో పూజ‌లు ర‌ద్ద‌వుతున్నాయి. ఈ క్ర‌మంలోనే మ‌న దేశంలోనే పేరున్న ప్ర‌ముఖ దేవాల‌యాల‌ను సైతం మూసి వేస్తున్నారు. తిరుమ‌ల తిరుప‌తి ఆల‌యాన్ని సైతం మూసి వేశారు. ఎప్పుడో సాళువ న‌ర‌సింహా రాయుల కాలంలో ఓ సారి తిరుప‌తి దేవాల‌యం మూసి వేసిన‌ట్టు చ‌రిత్ర చెపుతోంది. ఇప్పుడు మ‌ళ్లీ చాలా ద‌శాబ్దాలు.. ఇంకా చెప్పాలంటే శ‌తాబ్దాల త‌ర్వాత తిరుమ‌ల వెంక‌న్న ఆల‌యాన్ని మూసి వేయాల్సిన ప‌రిస్థితి వ‌చ్చింది.

 

నిత్యం ల‌క్ష నుంచి రెండు మూడు ల‌క్ష‌ల వ‌ర‌కు తిరుమ‌ల‌కు భ‌క్తులు వ‌స్తుంటారు. అస‌ల తిరుమ‌ల ప్ర‌తి రోజు ఎలా భ‌క్తుల‌తో కిట‌కిట లాడుతూ ఉంటుందో ?  ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క ర్లేదు. ఇక క‌రోనా ఎఫెక్ట్ ఇప్పుడు తిరుమ‌ల వెంక‌న్న పూజ‌ల‌పై సైతం ప‌డింది. ఒక‌ప్పుడు తిరుమ‌ల‌లో పూజ‌లు సైతం అర‌కొరా పుష్పాల‌తోనే చేయాల్సి వ‌స్తోంది. ఒక‌ప్పుడు తిరుమ‌ల‌లో వెంక‌న్న స్వామికి పూజ‌లు చేయాలంటే నిత్యం 100 కేజీల పూలు వినియోగించే వారు. అంటే ప్ర‌తి రోజు 100 కిలోల పుష్పాల‌తో స్వామికి అలంక‌ర‌ణ చేస్తారు.. అయితే ఇప్పుడు క‌రోనా దెబ్బ‌తో కేవ‌లం 30 కిలోల పూల‌తోనే స్వామికి అలంక‌ర‌ణ‌లు.. పూజ‌లు చేస్తున్నార‌ట‌.

 

అస‌లు తిరుమ‌ల ఆల‌యంకు ఎంత చ‌రిత్ర ఉందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ఇప్పుడు మ‌ళ్లీ ఇన్ని సంవ‌త్స‌రాల‌కు ఆల‌యం యూసి వేయ‌డ‌మే ఓ చారిత్రాత్మ‌క విష‌యం అనుకుంటే.. ఇక దేవుడికి పూజ‌లు.. పూల అలంక‌ర‌ణ‌ల విష‌యంలో సైతం పూలు సైతం పూర్తిగా దొర‌క‌ని ప‌రిస్థితి నెల‌కొంది. ఇక  ఈ క‌రోనా వైర‌స్ ఎప్పుడు పూర్తిగా అదుపులోకి వ‌స్తుందో ?  మ‌ళ్లీ తిరుమ‌ల‌లో ఎప్పుడు భ‌క్తుల క‌ళ‌క‌ళ నెల‌కొంటుందో ?  చూడాలి.

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

Apple : https://tinyurl.com/NIHWNapple

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: