కరోనా వైరస్ దెబ్బకు దేశం మొత్తం లాక్ డౌన్‌లోకి వెళ్ళిన విషయం తెలిసిందే.  లాక్ డౌన్ నేపథ్యంలో ఏప్రిల్ 14 వరకు ప్రజలంతా తప్పనిసరిగా ఇంట్లోనే ఉండాలి.  అయితే నిత్యావసర వస్తువులకు, ఎమర్జన్సీ సేవలకు మాత్రం మినహాయింపు ఉంది. ఇక ఈ లాక్ డౌన్ కారణంగా మద్యం షాపులు కూడా బంద్ అయిపోయాయి. దీంతో మందుబాబులు విలవిలలాడిపోతున్నారు. మద్యానికి బానిసైన వారు ఏం చేయాలో అర్థం కాక జుట్టు పీక్కుంటున్నారు.

 

అసలు రోజూ చుక్క పడందే ఉండలేని వారు గిలగిలా కొట్టేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే మద్యం బాబులు కల్లు దుకాణాల మీద వాలిపోతున్నారు. పల్లెటూరుల్లో కల్లు విక్రయానికి పెద్దగా అడ్డంకులు లేకపోవడంతో మందుబాబులు అటు వైపు వెళ్లిపోతున్నారు. అయితే గుంపులు గుంపులుగా ఉంటున్నారని పోలీసులకు తెలిస్తే వారిని ఇరగదీస్తున్నారు. ఎట్టి పరిస్థితిల్లోనూ  కల్లు అమ్మకానికి కూడా ఒప్పుకోవడం లేదు.

 

ఇలాంటి సమయంలోనే మందుబాబులు మరో దారిలో వెళుతున్నారు. పొద్దునే కల్లుగీత కార్మికుడుని నిద్రలేపి మరి తీసుకెళ్లిపోయి, చెట్టు మీద కల్లు తీయించుకుని, అక్కడికక్కడే తాగేస్తున్నారు. ఎక్కువ శాతం తాడిచెట్లు పోలాల్లోనే ఉంటాయి కాబట్టి, అక్కడ కల్లు తాగేవాళ్ళకు పెద్దగా ఇబ్బందులు రావడం లేదు.

 

దీంతో మందు లేక కష్టాలు పడే మందుబాబులు పొద్దునే తాడిచెట్ల దగ్గర ప్రత్యక్షమవుతున్నారు. గీతకార్మికుడుకు డబ్బులు ఎంతైనా ఇచ్చి, కల్లు ఫుల్‌గా తాగేస్తున్నారు. ఇక మరికొందరు అయితే సాయంత్రం సమయాల్లో వెళ్ళి కల్లు కుండలు లేపుతున్నారు. కానీ కల్లుకు డిమాండ్ ఫుల్‌గా పెరిగిపోవడంతో, అందులో కల్తీ పెరిగిపోయింది. మందుబాబులు అందరూ కల్లు కోసం వస్తుండటంతో, కొన్ని చోట్ల కల్తీ కల్లు తయారుచేసి అమ్మేస్తున్నారు. ఫలితంగా మందుబాబులు ఆరోగ్యాలు పాడైపోయే అవకాశాలు ఎక్కువ కనిపిస్తోన్నాయి.

 

ఇక తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో ఈ కల్తీ కల్లు ఎక్కువ తయారవుతుంది.  రసాయనాలు కలిపి తయారుచేసే కల్తీ కల్లుకు చాలామంది బానిసలైపోయారు. మొత్తానికైతే కరోనా దెబ్బకు మందుబాబులు కల్లు మీద పడ్డారు.

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

మరింత సమాచారం తెలుసుకోండి: