టీవీల్లో జనం ఏది ఎక్కువగా చూస్తారు.. ఈ ప్రశ్నకు సమాధానం చాలా సింపుల్.. మాంచి రిలీజ్ సినిమా టీవీల్లో వస్తే జనం ఎగబడి చూస్తారు. సినిమా ప్రసారం చేసిన టీవీ ఛానల్‌కు మాంచి రేటింగ్స్ వస్తాయి. అందుకే సినిమాల శాటిలైట్ రైట్స్ కోట్లకు అమ్ముడు పోతుంటాయి. ఇక సినిమాల తర్వాత టీఆర్‌పీ రేటింగ్ ఎక్కువగా వచ్చేది క్రికెట్ మ్యాచ్‌లకే. అందులోనూ ఐపీఎల్ మ్యాచ్‌ లకు ఆదరణ చాలా ఎక్కువ.

 

 

అయితే ఇప్పుడు ఓ రాజకీయ నాయకుడి స్పీచ్ ఈ రికార్డులు అన్నీ బద్దలు కొట్టేసింది. ఆ ప్రసంగమే పీఎం మోడీ లాక్ డౌన్ ప్రసంగం. జనతా కర్ఫ్యూ తర్వాత మరోసారి టీవీ ఛానళ్ల ద్వారా ప్రజల ముందుకు వచ్చిన మోడీ 21 రోజుల పాటు దేశాన్ని లాక్ డౌన్ చేస్తున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. కరోనా వ్యాప్తిని అరికట్టే ఉద్దేశంతో ప్రధాని నరేంద్ర మోదీ దేశవ్యాప్త లాక్ డౌన్ ప్రకటిస్తూ జాతినుద్దేశించి చేసిన ప్రసంగం ఇప్పుడు కొత్త రికార్డులు సృష్టించిందట. బుల్లితెర రికార్డులు బద్దలు కొట్టిందట.

 

 

టీవీ రేటింగ్స్ పరంగా ఇప్పటివరకు ఉన్న అన్ని రికార్డులను మోదీ లాక్ డౌన్ ప్రసంగం తిరగరాసిందట. ఈ ప్రసంగం దాదాపు 200కు పైగా టీవీ చానళ్లలో లైవ్ వచ్చిందట. మొత్తం 20 కోట్ల మంది వరకూ ఈ స్పీచ్ ను లైవ్‌లో చూసారట. ఇది ఇప్పటి వరకూ అత్యధిక వ్యూయర్ షిప్ నమోదు చేసిన టీవీ స్పీచ్ అని చెబుతున్నారు.

 

 

గతంలో ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ 13.3 కోట్ల వ్యూయర్ షిప్‌ తో టాప్‌ గా ఉందట. ఇప్పుడు మోడీ లాక్ డౌన్ స్పీచ్ దాన్ని అధిగమించేసిందని టీవీ రేటింగ్ ఏజెన్సీ 'బార్క్' చెబుతోంది.

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN
వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

Apple : https://tinyurl.com/NIHWNapple

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: