కొరోనా వైరస్ పుట్టినిల్లు అయిన చైనాలోని వూహాన్ అన్న విషయం ప్రపంచానికంతా బాగా తెలిసిందే. ఐదు నెలల క్రితం వరకూ వూహాన్ గురించి ప్రపంచంలోని చాలామందికి తెలీదనే చెప్పాలి. అలాంటి కొరోనా పుణ్యమా అని ఇపుడు వూహాన్ చాలా పాపులర్ సిటి అయిపోయింది. ఇక్కడ విషయం ఏమిటంటే ఈ ప్రావిన్స్ లో కొరోనా వైరస్ ఎంత తొందరగా వ్యాపించిందో అంత తొందరగానే కంట్రోలో అయిపోయింది. ఇది ప్రపంచ దేశాల్లో జరుగుతున్న ప్రచరం.

 

మరి వాస్తవం ఏమిటి ? ఏమిటంటే కొరోనా వైరస్ తొందరగానే కంట్రోల్ అయిన మాట వాస్తవమే. కానీ వైరస్ బయటపడిన దగ్గర నుండి కంట్రోల్ అయ్యే మధ్యలో వూహాన్ సిటిలో ఏమి జరిగింది ? ఇపుడిదే ప్రపంచదేశాలకు పెద్ద పజిల్ అయిపోయింది. అయితే అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం వూహాన్ లో మరణాలు లక్షల్లోనే ఉందట. ఎలాగంటే చెన్నైలో కార్లలో వాడే సెక్యురిటి సిస్టం తయారీ యూనిట్ ఉందట. ఈ కంపెనీకి ప్రపంచంలోని చాలా దేశాల్లో క్లైంట్లున్నట్లే చైనాలో కూడా ఉన్నారట.

 

చైనాలోని అనేక నగరాలతో పాటు వూహాన్ సిటిలో కూడా కంపెనీకి లక్షల్లోనే ఖాతాదారులున్నట్లు సమాచారం. వీళ్ళంతా ప్రతినెలా తమ సిస్టమ్ ను రీచార్జి చేసుకుంటుంటారు. అయితే గడచిన మూడు నెలలుగా లక్షల మంది ఖాతాదారులు తమ సిస్టమ్ ను రీచార్జి చేసుకోవటం లేదు. ఎందుకు రీచార్జి చేసుకోలేదో కంపెనీకి అర్ధం కాలేదట. దాంతో అదే విషయాన్ని వూహాన్ లోని ఖాతాదారులను కాంటాక్ట్ చేయటానికి ప్రయత్నించింది.

 

దాంతో కంపెనీ తరపున ఫోన్ చేస్తుంటే వూహాన్ లోని ఖాతాదారుల ఫోన్ నెంబర్లు పనిచేయటం లేదనే సమాధానం వస్తోందట. ఇటువంటి సమాధానం లక్షల్లోనే వినిపిస్తోందట. ఎవరైనా రిమోట్ ఏరియాకు వెళితే సిగ్నల్ ఉండకపోతే ఫోన్ చేయకపోవటం మనకందిరికీ అనుభవమే. కానీ రోజుల తరబడి ఒకటే సమాధానం వస్తుండటంతో కంపెనీ ఆశ్చర్యపోయింది. అదే సమయంలో వూహాన్ లోని ఎలక్ట్రిక్ క్రిమటోరియంలు రోజుల తరబడి 24 గంటలూ పనిచేస్తుండటం, నెలల తరబడి ఇళ్ళల్లో దీపాలు వెలగకపోవటంతో కొరోనా వైరస్ దెబ్బకు లక్షల్లోనే మరణించి ఉంటారనే అనుమానాలు పెరిగిపోతున్నాయి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: